బాపట్లటౌన్: మండలంలోని కేబీపాలెం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 866/2బి, 791/1ఎలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో గత ప్రభుత్వం 295 మంది నిరుపేదలకు జగనన్న కాలనీ కింద ఇళ్ల స్థలాలు అందజేశారు. గత రెండు రోజుల నుంచి కొంతమంది భూ కబ్జాదారులు జగనన్న కాలనీలోకి ప్రవేశించి స్థలాలను కబ్జా చేయడంతోపాటు స్థలాల్లో ఉన్న తుమ్మ, సుబాబుల్ చెట్లను అక్రమంగా నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మల్లెల పవన్, మార్పు లక్ష్మణ, పల్లెకొండరాజు, యారం కై లాష్ మహార్షి, తోకల చిట్టి, తోకల రాముడు, కొండ్రు బాబురావు, తోకల అంబేడ్కర్, తోకల చంటి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్‌కు కేబీపాలెం వాసుల వినతి


