ఎయిమ్స్‌ అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌ అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష

Mar 6 2026 8:24 AM | Updated on Mar 6 2026 8:24 AM

ఎయిమ్స్‌ అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష 9న సీనియర్‌, అండర్‌–23 క్రికెట్‌ జట్ల ఎంపిక రేషన్‌ బియ్యం పట్టివేత పాండురంగపేటలో చైన్‌ స్నాచింగ్‌

మంగళగిరి టౌన్‌: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రిలో సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఎయిమ్స్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఎయిమ్స్‌లో సమస్యలను అధిగమించే అంశంపై గతంలో రివ్యూల్లో సమీక్షించామని పేర్కొన్నారు. ఎయిమ్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఒక గొప్ప రీసెర్చ్‌ అండ్‌ అకడమిక్‌ ఇనిస్టిట్యూట్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో ఫైనాన్స్‌ మినిస్ట్రీ నుంచి దాదాపు 500 పోస్టులకు అనుమతులు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఎయిమ్స్‌లో గతంలో 12 ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా నేడు 87 థియేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్త పరీక్షలకు ఆలస్యం అవుతుందని, మిగతా అన్ని పరీక్షలు త్వరగానే రిపోర్టులు వస్తున్నాయని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఫార్మసీ కౌంటర్లు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల సౌకర్యార్ధం ఆసుపత్రి ఆవరణలో బస్‌ షెల్టర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అహంతం సాంతాసింగ్‌, ఎయిమ్స్‌ అధికారులు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున త్రీమెన్‌ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్‌, అండర్‌–23 యువకుల క్రికెట్‌ జట్టు ఎంపిక ఈనెల 9న తేదీ ఉదయం 07.30 గంటలకు అరండల్‌పేట 10/3 శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని యు.మహతి శంకర్‌ గురువారం ఒక ప్రటకటనలో పేర్కొన్నారు. అండర్‌–23 బాలురు 01–09–2003 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. సీనియర్‌ జట్టుకు వయస్సు పరిమితి లేదన్నారు. ప్లేయర్స్‌ వైట్‌ డ్రెస్‌తోపాటు సొంత కిట్‌ బ్యాగ్‌తో రిపోర్ట్‌ చేయాలన్నారు. డిజిటల్‌ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్స్‌, ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ కాఫీతో రిపోర్ట్‌ తప్పనిసరన్నారు.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేట పరిసర ప్రాంతాల నుంచి క్రాంతి, హతీబ్‌ అనే వ్యక్తులు రేషన్‌ బియ్యం సేకరించి తరలిస్తుండగా, గురువారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేశారు. ఆటోలో తరలిస్తున్న 35 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఇరువురితోపాటు, డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసి బియ్యాన్ని, వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తెనాలిరూరల్‌: పట్టణ పాండురంగపేటలో రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు తెంపుకొని వెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇదే ప్రాంతానికి చెందిన మహిళ లావు గాయత్రి కాలారీ హాస్పిటల్‌ వద్ద గురువారం సాయంత్రం నడిచి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితురాలు అప్రమత్తమై కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement