కిల్కారీ సేవలు అమలు తీరు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కిల్కారీ సేవలు అమలు తీరు పరిశీలన

Mar 6 2026 8:24 AM | Updated on Mar 6 2026 8:24 AM

కిల్కారీ సేవలు అమలు తీరు పరిశీలన

పెదకాకాని: బాలింతలు, గర్భిణులు ప్రభుత్వం అమలు చేస్తున్న కిల్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ రాజు అన్నారు. మండలంలోని వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కొప్పురావూరు సబ్‌సెంటర్‌ను గురువారం జిల్లా కిల్కారి రీజినల్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు అందుతున్న కిల్కారీ సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిల్కారీ కాల్‌ నెంబర్‌ 911600403660 ని గర్భిణీలు మరియు బాలింతలు మొబైల్‌ ఫోన్‌ లో సేవ్‌ చేసుకోవాలని సూచించారు. మరల వినాలి అనుకుంటే 14423 లేక టోల్‌ ఫ్రీ నంబర్‌ కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. కిల్కారి కాల్‌ని కేంద్ర ప్రభుత్వం మాత శిశు మరణాలు తగ్గించడానికి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కిల్కారి కాల్‌ నెలకు ఒకసారి వాయిస్‌ ద్వారా తల్లి బిడ్డల సంరక్షణ గురించి చెబుతారన్నారు. ఈకాల్‌లో గర్భిణులు, బాలింతలు తీసుకోవలిసిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి, హై రిస్క్‌ గురించి, బర్త్‌ ప్లాన్‌, టీకాలు గురించి, ఫ్యామిలీ ప్లానింగ్‌ గురించి, రక్తహీనత గురించి అతి ప్రాముఖ్యమైన సలహాలు, సూచనలు అందజేయడం జరుగుతుందన్నారు. కిల్కా రి కాల్స్‌ గర్భిణి అయిన 4 వ నెల నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకూ వస్తాయన్నారు. డాక్టర్‌ రామాంజిరెడ్డి, పీహెచ్‌ఎన్‌ భవాని, ఎంపీహెచ్‌ఈఓ శ్రీనివాసరావు, ఏఎన్‌ఎం నాగమణి, ఆశలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement