18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నగరంపాలెం: జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగం కేసులో మరొకర్ని అరెస్ట్ చేశామని గుంటూరు సీసీఎస్ డీఎస్పీ బీవీ.మధుసూదనరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసు వివరాలను సీసీఎస్ డీఎస్పీ తెలిపారు. జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగంపై గతేడాది నవంబర్ 28న డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి కె.శీనారెడ్డి ఫిర్యాదుతో నల్లపాడు పీఎస్‌లో కేసు నమోదైందని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు ఏ–8 అయిన బాపట్ల టౌన్ పటేల్‌నగర్ రెండో వీధిలో ఉంటున్న పీటా వెంకటేశ్వరావు కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఈనెల రెండో తేదీన అతన్ని గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ సమీపాన అరెస్ట్ చేశామన్నారు. గతంలో వెంకటేశ్వరరావు నల్లపాడు జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గంలో సభ్యుడిగా నామినేట్ చేశారని తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించారని అన్నారు. పరారీలో ఉన్న కొందర్ని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
గుంటూరు వెస్ట్: జిల్లాలో రేషన్ దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, వారి సిబ్బందితో కలసి విస్తృతంగా తనిఖిలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెలలో రేషన్ పంపిణీ జరుగుతున్న పలు చౌక ధరల దుకాణాలలో పౌర సరఫరాల సిబ్బంది ఆకస్మికగా తనఖిలను నిర్వహించి వాటిలో వ్యత్యాసాలు గుర్తించిన రేషన్ దుకాణాల డీలర్లపై 6ఎ, క్రిమినల్ కేసులను నమోదు చేయడం జరిగిందని వివరించారు. గుంటూరు నగరంలో రేషన్ షాప్ నెంబర్ 0781095, 0781106, 0781141లలో తనిఖీలను నిర్వహించగా ఆ దుకాణాల్లో బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. రేషన్ షాపుల నెంబర్లు 0781003, 0781018, 0781015 లో తనిఖీలను నిర్వహించగా వాటిలో బియ్యం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించామన్నారు. తాడేపల్లి మండల పరిధిలో రేషన్ షాప్ నెంబర్ 0793014 లో తనిఖీలు నిర్వహించగా అక్కడ కూడా బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించి డీలర్లపై కేసులను నమోదు చేశామన్నారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు, విక్రయాలు జరిపితే నేరమని తెలిపారు. అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు.
18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు


