మహా శివరాత్రి వాల్ పోస్టర్ ఆవిష్కరణ
గోవాడ(వేమూరు): మహా శివరాత్రి తిరునాళ్లను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోవాడ దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్ తెలిపారు. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో వాల్‌పోస్టర్లు మంగళవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ నుంచి మహాశివరాత్రి తిరునాళ్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 13 నుంచి 17వ తేది వరకు తిరునాళ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారి వర్మ పాల్గొన్నారు.
యద్దనపూడి: మండలంలోని యద్దనపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు అభిలాష్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏరోస్కాటోబాల్ పోటీల్లో అండర్ 14 విభాగంలో మూడో స్థానం సాధించాడు. ఏరోస్కాటోబాల్ ఫెడరేషన్ ఆప్ ఇండియా ఆధ్వర్యంలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మహారాష్ట్రలోని షిర్డీలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థి పాల్గొన్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే గుర్తించిన జాతీయ ఖేల్ మహోత్సవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అతడు పాల్గొని స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇందులో భాగంగా అభిలాష్ మోడల్, కప్‌తోపాటు ప్రశంస పత్రం అందుకున్నాడు. మార్టూరు వివేకానంద స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి రవి పశుసంవర్థక శాఖలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు.
చినగంజాం: పాలకొల్లులో వపా బాపు ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన దక్షిణ భారత చిత్రకారులచే ఆర్ట్ క్యాంపులో చినగంజానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సూరిబోయిన శ్రీనివాసరెడ్డి గుర్తింపు లభించింది. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు చిక్రకారులు పాల్గొనగా లైవ్ పెయింటింగ్ పోటీలో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం అనే అంశానికి సంబంధించి అమరావతి, పోలవరం, గూగుల్ సెంటర్, గిరిజన తండాల అభివృద్ధి, క్యాంటం వ్యాలీ, పర్యాటక ప్రాంతాలు, ప్రసిద్ధ క్షేత్రాలకు సంబంధించిన పెయింటింగ్ వేసేందుకు పోటీలు నిర్వహించగా శ్రీనివాసరెడ్డి గిరిజన తండాల అభివృద్ధి అనే అంశంపై పెయింటింగ్ వేసి నిర్వాహకుల నుంచి సత్కారం అందుకున్నారు. అతనికి శాలువా కప్పి ప్రశంస పత్రం, మెమెంటో అందజేసి గౌరవించారు.
చెరుకుపల్లి: సంప్రదాయ వస్త్రం చెరుకుపల్లి షర్టింగ్ క్లాత్ (ఆరుంబాక చెక్ అంగడి ష్టింగ్)కు భౌగోళిక సూచిక గుర్తింపు సాధించేందుకు అవసరమైన సమాచారం సేకరించినట్లు జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు. చెరుకుపల్లిలోని ఆరుంబాక చేనేత సహకార షర్టింగ్ అంగడిని మంళవారం సందర్శించి దుకాణంలోని వస్త్రాలను పరిసీలించారు. ఆయన మాట్లాడుతూ సంప్రదాయ చెరుకుపల్లి షర్టింగ్‌కు సంబంధించిన చరిత్ర, ప్రత్యేక లక్షణాలు, తయారీ ప్రక్రియలు, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత వంటి అంశాలను సమగ్రంగా లిఖితపూర్వకంగా డాక్యుమెంటేషన్ చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చేనేత కార్మికులు తాము నేత నేచే విధానం కళకు సంబంధించిన చారిత్రక ఆధారాలు, సాంకేతిక వివరాలను అధికారులకు వివరించారు. భౌగోళక సూచిక(జీఐ) నమోదు దరఖాస్తును త్వరలో ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆరుంబాక చేనేత సహకార సంఘ అధ్యక్షుడు దివి రాంబాబు, పలువురు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ పూర్తి స్థాయి నియామకం
కొరిటెపాడు: గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్‌గా బిట్రగుంట మల్లికలను నియమిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ.వి.రాజమౌళి మంగళవారం సాయంత్రం జీవో విడుదల చేశారు. సభ్యులుగా కొనకళ్ల వెంకటసత్యనారాయణ, ముదావత్ మంగాబాయి, కె.విజయలక్ష్మి, మొహమ్మద్ హఫీజ్, మేళం సైదయ్య, షేక్ ఖాదర్‌బాయి, బత్తుల జాన్‌సైదా, దర్శనపు విజయమ్మ, చంద్రగిరి బాబు, ఇమ్మడి వెంకటలక్ష్మి, డి.భాగ్యారావు, ఎన్. వంశీకృష్ణ, కె.శ్రావణకుమారిలను నియమిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.
మహా శివరాత్రి వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మహా శివరాత్రి వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మహా శివరాత్రి వాల్ పోస్టర్ ఆవిష్కరణ


