బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Feb 3 2026 7:31 AM | Updated on Feb 3 2026 7:31 AM

బాపట్

బాపట్ల

మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారం చూపాలి

న్యూస్‌రీల్‌

నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా టీడీపీ సర్కార్‌పై ఆగ్రహం రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3400, గరిష్ట ధర రూ.4800, మోడల్‌ ధర రూ.4200 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 54.90 టీఎంసీలు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల:ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అర్జీదారులు ఇచ్చే అర్జీలను పరిశీలించి పరిష్కరించి చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవా రం కలెక్టరేట్‌ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి.జి.ఆర్‌.ఎస్‌)లో వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, జేసీ భావన, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌, డిప్యూటీ కలెక్టర్‌ లవన్న అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలపై 235 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని, కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని తర్వాత సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని అర్జీదారులకు సూ చించారు. ప్రజల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజ ల నుంచి అర్జీల స్వీకరణ జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ఇదే క్రమాన్ని పాటించాలని సూచించారు. నమోదైన అర్జీలను పరిశీలించి న, తదుపరి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించా లన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, జెడ్పీ సీఈఓ ఏ.ఎస్‌.రాజు, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్‌, గృహ నిర్మాణ సంస్థల పీడీలు విజయలక్ష్మి, సింగ య్య, పాల్‌, రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్‌ఎస్‌ పద్మావతి, డీటీఓ పరంథామరెడ్డి, డీఐసీ జీఎం రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల టౌన్‌: కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగటమే కానీ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి తిరుగుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటూ టీడీపీ సర్కార్‌పై మండిపడ్డారు. నల్లమడ వాగును తక్షణమే ఆధునికీకరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నల్లమడ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.

● రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ మాట్లాడుతూ టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఇబ్బందులు పరిష్కరించాలని అర్జీలు పెట్టడమే కానీ...పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని, నల్లమడ వాగు ఆధునికీకరణ చేయాలని, నల్లమడ వాగు గండ్లను పూడ్చేందుకు నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేక ఆందోళన చేపట్టామన్నారు.

● బాపట్ల, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు 50 గ్రామాలు పూర్తిగా వర్షధార వ్యవసాయంపై ఉన్నాయన్నారు. తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు లేని ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న కృష్ణా జలాలను గుంటూరు ఛానల్‌ ద్వారా పర్చూరు వరకు తరలించాలని పలు పర్యాయాలు గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు.

నల్లమడ ఆధునికీకరణ కలేనా..?

● గత రెండేళ్ళుగా వస్తున్న తుఫాన్లకు, వరదలకు పై నుంచి వస్తున్న ఉధృతికి దిగువ ప్రాంతాల్లోని నల్లమడ వాగుకు గండ్లు పడి పొలాలు ముంపునకు గురై రూ.లక్షల్లో నష్టాలు వస్తున్నా కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నల్లమడ వాగు ఆధునీకరణ నిమిత్తం పరిపాలన అనుమతుల కోసం ఇప్పటికే అధికారులకు రూ. 337.30 కోట్ల అంచనాలను సమర్పించటమైందన్నారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా నల్లమడ వాగును పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా అతీగతీ లేదన్నారు.

● కేంద్ర, రాష్ట్ర కమిటీల నివేదికల ప్రకారం నల్లమడ వాగును 500 సీ వాల్యూకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నల్లమడ ఆధునికీకరణకు పరిపాలనా పరమైన అనుమతులు ఉన్నప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. కనీసం గండ్లు కూడా పూడ్చకపోవడంతో వర్షాకాలంలో ముంపునకు గురై పంటలకు భారీ నష్టం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు దేవవరపు లక్ష్మీనారాయణ, లావు అంకమ్మ చౌదరి, నాయుడు సుబ్బారావు, మువ్వా పెద్దన్న, కాపు సాంబశివరావు, గోరంట్ల బాబు, దండా శ్రీనివాసరావు, చెన్నుపాటి సూర్యపకాశరావు, ఎం. రాము, మలినడి జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.

7

బాపట్ల1
1/8

బాపట్ల

బాపట్ల2
2/8

బాపట్ల

బాపట్ల3
3/8

బాపట్ల

బాపట్ల4
4/8

బాపట్ల

బాపట్ల5
5/8

బాపట్ల

బాపట్ల6
6/8

బాపట్ల

బాపట్ల7
7/8

బాపట్ల

బాపట్ల8
8/8

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement