తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మహాపాపం | - | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మహాపాపం

Feb 3 2026 7:31 AM | Updated on Feb 3 2026 7:31 AM

తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మహాపాపం

తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మహాపాపం

రేపల్లె: పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేయడం మహా పాపమని వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఈవూరు గణేష్‌ పేర్కొన్నారు. సీబీఐ స్పష్టమైన నివేదిక ఇచ్చినా దానిని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌న్‌లో టీడీపీ నేతలు కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టస్తున్నారని విమర్శించారు. ఈ అసత్య ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రేపల్లె పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాజశేఖర్‌కు, రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డాక్టర్‌ గణేష్‌ మాట్లాడుతూ సీబీఐ నివేదికలో తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టంగా తేలినా, నిజాలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిట్రిక్స్‌కు తెరలేపారని అన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడటం టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఫ్లెక్సీలను తొలగించాలని కోరిన అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీలు దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సంస్కృతి కొనసాగితే రానున్న రోజుల్లో టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫ్లెక్సీలను వెంటనే తొలగించకపోతే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తామే తొలగిస్తామని హెచ్చరించారు.

ఇసుకపల్లిలో ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చిత్రాల ఓబేదు, చిమట బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, మండల కన్వీనర్‌లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్‌, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, నాయకులు పట్టెం శ్రీనివాసరావు, లియాఖత్‌ బాషా, ఖుద్దూష్‌, శొంఠి సురేష్‌, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

కూటమి నేతలపై పోలీసులకు వైఎస్సార్‌ సీపీ ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement