ప్రశాంత వాతావరణంలో టెన్త్ పరీక్షలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు పరీక్షలకు హాజరుకానున్న బాలికలు 7967, బాలురు 7977
బాపట్ల: మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించా రు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను తహసీల్దార్లు, ఆర్డీఓలు, డీఈఓ, ఎంఈఓలు ముందుగా పరిశీలించి ఏమైనా సమస్య లు ఉంటే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులు 9 గంటల కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్, ఫస్ట్ ఎయిడ్, ఏఎన్‌ఎం నియమించాలని, పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించా రు. పరీక్ష ముగిసిన వెంటనే జవాబు పత్రాల ను సమీపంలో ఉన్న పోస్టాఫీస్లో అందజేయాలన్నారు. పరీక్ష జరిగే రోజు 144 సెక్షన్ విధించడంతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లాకు వచ్చే ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చాలని, పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను బందోబస్తుతో తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు సూచించారు. డీఈఓ శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ, పోలీసు, విద్యుత్, ఆర్టీసీ, అధికారులు పాల్గొన్నారు.
బాపట్ల సేవా సేతుతో తల్లి ప్రేమను అనుసంధానించాలి
అంగన్‌వాడీ కేంద్రాలకు బాపట్ల సేవా సేతు ద్వారా తల్లి ప్రేమను అనుసంధానించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. బాపట్ల సేవా సేతు ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలలో మాలిక సదుపాయాల కల్పనపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,552 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. దాతలు అందించే విరాళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ
పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్త సేకరణ జరగాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ, మున్సిపల్ రంగాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉపాధి నిధులతో అభివృద్ధి పనులు
ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై జిల్లా, మండలస్థాయి అధికారులతో సమీక్షించారు.


