ముగిసిన విజ్ఞాన్ బాల మహోత్సవ్
● ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లవరపు సూర్యతేజ మాట్లాడుతూ తాను చిన్నతనంలోనే ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నానని, అప్పటి నుంచి ఆ దిశగా నిరంతరంగా కృషి చేశానని, లక్ష్యం స్పష్టంగా ఉంటే మార్గం కూడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ చదువు క్రీడలను సమతుల్యంగా కొనసాగించడమే సంపూర్ణ అభివృద్ధికి మార్గమని సూచించారు.
● అండర్–17 మహిళల విభాగం వాలీబాల్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలను పెదకూరపాడు జీఆర్‌సీఆర్‌కే హైస్కూల్, కేవీఎస్‌ఏపీ పీఎం శ్రీ స్కూల్‌లు సాధించాయి.
● కబడ్డీలో బాపట్ల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పిడుగురాళ్ల తిరుమల ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలు, చెస్‌లో మొదటి రెండు స్థానాలను బోయనపల్లి కుందన, సీహెచ్ దివ్యలు సాధించారు.
● అండర్–17 బాలుర విభాగంలో బాస్కెట్‌బాల్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, శేకూరు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలు నిలిచాయి.
● కబడ్డీలో బాపట్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పిడుగురాళ్ల తిరుమల ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలు విజేతలుగా నిలిచాయి.
● 100 మీటర్లు పరుగు పందెంలో ఎస్‌కే మక్బుల్ హుస్సేన్, పి.మనోజ్, 800 మీటర్లు పరుగు పందెంలో ఎస్‌కే మక్బుల్ హుస్సేన్, బీ.నాగ మణికంఠలు, 4 ఇంటు 100 మీటర్ల రిలేలో ఏఆర్‌ఎస్‌ఆర్‌ఎం హైస్కూల్ జట్టు, ఏపీఆర్‌ఎస్ స్కూల్, రాజంపేట జట్టు విజేతలుగా నిలిచారు.
● లాంగ్‌జంప్‌లో పి.ప్రదీప్ కుమార్, పి.దేవకుమార్‌లు, షాట్‌పుట్‌లో బి.అశ్విన్, ఎం. నాగ అజయ్‌లు విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
● టెడ్‌ఎక్స్ స్పీకర్ ఎమినెంట్ ఇంజినీర్, ఫోర్బ్స్ 200 డీజీఈఎంఎస్, మాజీ ఏసీఎం ఇండియా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ పద్మనాభుని మాట్లాడుతూ బయోటెక్నాలజీ రంగంలో ఔషధాల అభివృద్ధి, వ్యాధుల ముందస్తు గుర్తింపు, జీనోమ్ విశ్లేషణ, వ్యక్తిగత వైద్య సేవల రూపకల్పనలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. బెంగళూరులోని సీఐఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన్వీర్ హసన్, అమృత విశ్వ విద్యాపీఠం ప్రొఫెసర్ శ్రీరామ్ దేవనాథన్, ఐఐటీ మద్రాస్ సీఈఆర్‌ఏఐ ఏఐ పాలసీ హెడ్ డాక్టర్ గీతా రాజు, ఐఐటీ – ఏఐసీఓఈ ప్రాజెక్ట్ సైంటిస్ట్ కె.రుత్విక్, డిజిటల్ ఫ్యూచర్ ల్యాబ్స్ రీసెర్చ్ మేనేజర్ హర్లీన్ కౌర్, వర్చువల్‌గా విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ మహోత్సవ్ విజేతలకు ట్రోఫీలు, రూ. 5 లక్షల నగదు బహుమతులు అందజేత
చేబ్రోలు: చిన్న వయసులోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని, క్రమశిక్షణతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ (ఐఆర్‌ఎంఎస్) అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి రెండో ఎడిషన్ ‘విజ్ఞాన్ బాల మహోత్సవ్–2కే26’ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా బాల మహోత్సవ్ గెజిట్ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు.
బాల మహోత్సవ్ 2కే26 విజేతలు వీరే...
రాష్ట్రస్థాయి విజ్ఞాన్ బాల మహోత్సవ్‌లో భాగంగా మొత్తం 50 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు.
ఏఐ మోడల్‌తో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది
చేబ్రోలు: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో, స్వదేశీ అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఓపెన్ సోర్స్, లో రిసోర్స్ ఏఐ మోడళ్లు భవిష్యత్తులో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాదిగా మారతాయని స్విస్‌నెక్స్ ఇన్ ఇండియా కంపెనీ అకడెమిక్ ఎంగేజ్‌మెంట్ హెడ్ లీనా మారైకే జోసెఫిన్ రోబ్రా అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ కాన్‌క్లేవ్ ఆన్ రెస్పాన్సిబుల్ అండ్ సెస్టెయినబుల్ ఏఐ’ అనే అంశంపై సోమవారం సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ‘బిల్డింగ్ బెటర్ విత్ ఏఐ : సస్టేనబిలిటీ యాస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియా’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్విస్‌నెక్స్ ఇన్ ఇండియా కంపెనీ అకడెమిక్ ఎంగేజ్‌మెంట్ హెడ్ లీనా మారైకే జోసెఫిన్ రోబ్రా మాట్లాడుతూ.. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతో రూపొందించే ఏఐ మోడళ్ల ద్వారా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఆధునిక సాంకేతిక సేవలను అందించవచ్చని వివరించారు.
1/2
ముగిసిన విజ్ఞాన్ బాల మహోత్సవ్
2/2
ముగిసిన విజ్ఞాన్ బాల మహోత్సవ్