టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోండి
తప్పుడు ప్రచారంపై పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
చీరాల: తిరుపతి లడ్డూ వ్యవహారంపై సిట్ చార్జిషీట్‌కు విరుద్ధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు వేసి ప్రజల్లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నెయ్యి కల్తీ అంశంపై సీబీఐ, సిట్ కోర్టులో దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌ను పరిశీలిస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిపై ఎలాంటి నేరారోపణలు, పాత్ర నిర్ధారణ లేదని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చార్జిషీట్‌లో లేని ఆరోపణలును ప్రజా ప్రదేశాల్లో పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై ప్రజల్లో తప్పుదారి పట్టించే భావజాలాన్ని సృష్టించే యత్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్టర్లు కారణంగా ప్రజల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి, మాటల తగాదాలు, వాగ్వాదాలు చోటుచేసుకొని శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైతే చట్టవిరుద్ధంగా సిట్ అధికారకంగా తెలియపరచిన ఆధారాలను తప్పుదారి పట్టించి, దాడులు చేయడం, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగించే విధంగా చేసే ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, చీరాల మండల అధ్యక్షుడు అద్దంకిరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, కౌన్సిలర్లు గుంటూరు ప్రభాకరరావు, బత్తుల అనిల్, రైతు విభాగం అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, బూత్ లెవల్ చైర్మన్ శిఖా సురేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు గోలి గిరి, ఎస్.నవీన్, షేక్ మహబూబ్, కంచర్ల చక్రవర్తి, చెల్లి బాబూరావు, డిక్కి వెంకటరాజు, వాసిమళ్ల శ్రీను, కోండ్రు పూర్ణ, మొహమ్మద్ పాల్గొన్నారు.


