గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులుగా సుధీర్
బాపట్ల: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పి.సుధీర్‌ను ఎన్నుకున్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం సంఘం ఎన్నికలను ఎన్నికల అధికారి మన్సూన్‌బాషా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షుడు టి.ఎన్.వి.ఎస్.కృష్ణవేణి(వేటపాలెం), ఉపాధ్యక్షులుగా డి.సత్యనారాయణ(బాపట్ల), డి.సత్యకుమార్(కొల్లూరు), పి.కృష్ణ ప్రసాద్(ఇంకొల్లు), వి.ఆనందబాబు(అమృతలూరు), వి.శివ నాగరాజు(కర్లపాలెం), ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కే మునీర్(చిన్నగంజాం), జాయింట్ సెక్రటర్లుగా టి.వీరస్వామి(చీరాల), డి.రాజేష్‌బాబు(చుండూరు), జె.నాగాంజనేయులు పి.వి.పాలెం, డి.బుల్లిబాబు(కారంచేడు), కె.రామకృష్ణరెడ్డి(బాపట్ల), ఆర్గనైజింగ్ సెక్రటర్లుగా వి.చిట్టిబాబు(భట్టిప్రోలు), ఎ.వి.సుబ్రహ్మణ్యం(మార్టూరు), వి.కృష్ణరెడ్డి(చీరాల), జె.కోటేశ్వరరావు(నగరం), ఆర్.నాగమల్లేశ్వరరావు(రేపల్లె), మహిళా కార్యదర్శులుగా పి.నాగలక్ష్మి(నిజాంపట్నం), కె.సుజాత(పర్చూరు), కె.కల్యాణి(వేమూరు) ఎన్నికయ్యారు.


