నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి
పెదకూరపాడు: మూగజీవాలకు మేత కోసం వెళ్లి....నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని బలుసుపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పెదకూరపాడు ఎస్‌ఐ గిరిబాబు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బలుసుపాడు గ్రామంలో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో గేదెలకు మేత కోసం వెళ్లి నీటి కుంటలో పడి ఎస్సీ కాలనీకి చెందిన గంజిమాల బాబురావు (62) మృతి చెందాడు. గ్రామ శివారులో మేత కోస్తుండగా నీటి కుంటలో పడ్డాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా నీటి కుంటలో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సహాయంతో బాబురావు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. బాబురావు మనవడు గంజి మాల విజయబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. శవ పంచనామా నిర్వహించి అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడి ప్రతిభ
గుంటూరు మెడికల్: వెన్నుముక పరిశోధనల్లో జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడు ప్రతిభ చూపించి రెండు జాతీయ అవార్డులు ఒకేసారి సొంతం చేసుకుని అరుదైన రికార్డు సృస్టించారు. గుంటూరుకు చెందిన సీనియర్ స్పయిన్ సర్జన్, మల్లిక సెంటర్ అధినేత డాక్టర్ జె.నరేష్‌బాబు వెన్నుపై చేసిన పరిశోధనలకు రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మల్లిక స్పయిన్ సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ఆయన మీడియాకు వెల్లడించారు.
ప్రతిష్టాత్మక అస్సి బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు ..
అసోసియేషన్ ఆఫ్ స్పయిన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా గత వారం పూణేలో నిర్వహించిన స్పయిన్ సర్జన్స్ 2026 జాతీయ సదస్సులో మల్లిక స్పయిన్ సెంటర్ అరుదైన ఘనత సాధించింది. ఎంఆర్‌ఐలో కంటికి కనిపించని మార్పులను రేడియోమిక్స్‌అనే ఆర్టిఫి షల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వాడడం ద్వారా డిస్క్ అరుగుదలను ముందుగానే గుర్తించి నివారణోపాయాలను సూచించవచ్చు అని నిరూపించిన పరిశోధనకు అత్యంత ప్రతిష్టాత్మక అస్సి బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు 2026ను నరేష్ బాబు అందుకున్నారు. బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు తో పాటు క్లినికల్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు కూడా మల్లిక స్పయిన్ సెంటర్ గెలుచుకోవడం విశేషం. ఒకే సమయంలో ఈ రెండింటినీ సొంతం చేసుకున్న తొలి స్పయిన్ సెంటర్‌గా గుంటూరు మల్లిక స్పయిన్ సెంటర్ రెండు తెలుగు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించింది. సదస్సులో మల్లిక స్పయిన్ సెంటర్ నుంచి మొత్తం 11 పోడియం ప్రెజెంటేషన్లు జరగడం విశేషం. ఈ సందర్భంగా మల్లిక స్పయిన్ సెంటర్ చీఫ్ ఆఫ్ స్పయిన్ సర్వీసెస్ డాక్టర్ జె.నరేష్ బాబు మాట్లాడుతూ ఈ విజయాలు మొత్తం వైద్య బృందం, సహాయక సిబ్బంది అందరి కృషికి ప్రతిఫలమని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న తమ విద్యార్థి డాక్టర్ పృథ్వీకుమార్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి


