‘మార్చ్‌ టు పార్లమెంట్‌’ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘మార్చ్‌ టు పార్లమెంట్‌’ విజయవంతం చేయాలి

Feb 2 2026 7:25 AM | Updated on Feb 2 2026 7:25 AM

‘మార్చ్‌ టు పార్లమెంట్‌’ విజయవంతం చేయాలి

‘మార్చ్‌ టు పార్లమెంట్‌’ విజయవంతం చేయాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ జాతీయస్థాయిలో ఏడు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతో ఆవిర్భవించిన ఏఐ – జాక్టో ఆధ్వర్యంలో ఈనెల 5న చేపడుతున్న మార్చ్‌ టు పార్లమెంట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్‌టీఎఫ్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో ఎస్టీయూ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్‌ బాజీ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు నాయకులు మాట్లాడుతూ ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని, పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో చట్ట సవరణ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,04,125 ఉండగా, మన రాష్ట్రంలో 12,912 ఏకోపాధ్యాయ పాఠశాలలతో దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. బోధన కోసమే నియమించబడిన ఉపాధ్యాయులతో బోధనేతర కార్యక్రమాల భారం పెంచటం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. ఈనెల 10న జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర ఉపా ధ్య క్షులు కాకుమాను జోజప్ప, ఎం.శ్రీధర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యాంబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement