‘పచ్చ’ పంతాలకు పడకేసిన ప్రగతి | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ పంతాలకు పడకేసిన ప్రగతి

Feb 1 2026 3:23 AM | Updated on Feb 1 2026 3:23 AM

‘పచ్చ

‘పచ్చ’ పంతాలకు పడకేసిన ప్రగతి

‘పచ్చ’ పంతాలకు పడకేసిన ప్రగతి చీరాల: సమావేశం నిర్వహిస్తే కౌన్సిలర్లు ఎక్కడ గైర్హాజరవుతారోననే ఆందోళన నెలకొంది. అజెండాలో ముఖ్యమైన అంశాలు ఉంటే ఫోన్లు చేయించి కౌన్సిలర్లును పిలిపిస్తున్నారని సమాచారం. చైర్మన్‌ ఏకపక్ష నిర్ణయాలే దీనికి కారణమని సమాచారం. వార్డుల్లో కౌన్సిలర్లు ప్రతిపాదించిన పనులు ప్రారంభం కాకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ మించాల సాంబశివరావు వార్డుల్లో జరిగే అభివృద్ధి పనులకు మోకాలడ్డు పెడుతున్నారని పలువురు కౌన్సిలర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఆయనే అధికారులతో చెబుతున్నట్లుగా సమాచారం. చైర్మన్‌గా ఉన్న జంజనం శ్రీనివాసరావుపై గత ఏడాది ఏప్రిల్‌లో టీడీపీకి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు 17 మంది అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. ఆ పరిణామాల్లో టీడీపీ కౌన్సిలర్లు 25 మంది చైర్మన్‌గా మించాల సాంబశివరావును ఎన్నుకున్నారు. అభివృద్ధి విషయంలో ఆయన విఫలమయ్యారని టీడీపీ కౌన్సిలర్లే బహిరంగంగా విమర్శిస్తున్నారు. తమ మద్దతుతో చైర్మన్‌గా ఎన్నికై న వ్యక్తి తమ వార్డుల్లో పనులు చేయించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు చెందిన వార్డుల్లో కూడా అభివృద్ధి అటకెక్కింది. ఆమోదం తెలిపి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కావడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులు కొన్నింటికి టెండర్లు పిలిచారు. వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలకు కౌన్సిల్‌ ఆమోదించినా టెండర్లు పిలవకుండా కాలయాపన చేస్తున్నారు. దొడ్డిదారిన పనులు ప్రారంభించకుండా మోకాలడ్డు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ పలువురు కౌన్సిలర్లు తలలు పట్టుకుంటున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నెలలో జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక సమావేశం వాయిదా పడింది. గళమెత్తిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లును సంఖ్యా బలం ఉందనే కారణంతో సస్పెన్షన్లు చేయించుకుంటూ ఏకపక్షంగా అజెండాలోని అంశాలను ఆమోదింపజేసుకుంటున్నారు.

ఫోన్లు చేయించుకుని ..

ఎమ్మెల్యే చెప్పినా వార్డుల్లో పనులు సాగడం లేదని కౌన్సిలర్లు వాపోతున్నారు. మద్దతు తెలిపిన వారిలో ఎక్కువ మంది కౌన్సిల్‌ సమావేశానికి డుమ్మా కొడుతున్నారు. డిసెంబర్‌ నెలలో జరిగిన సమావేశానికి కూడా సభ్యులు గైర్హాజరవుతారనే అనుమానంతో సమావేశం ఆలస్యంగా ప్రారంభించారు. కోరం లేక వాయిదా పడకుండా ఫోన్లు చేయించుకుని కౌన్సిలర్లను రప్పించుకున్నారు. కౌన్సిల్‌ పదవీకాలం మార్చి 17తో ముగియనున్న నేపథ్యంలో ఆమోదించిన అభివృద్ధి పనులు పూర్తి చేయించుకునేందుకు కౌన్సిలర్లు ముందుకు వస్తున్నారు. చైర్మన్‌ మాత్రం కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తే ఎక్కువ మంది వస్తారో.. రారో అని జనవరి నెలలో సమావేశాన్ని నిర్వహించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చైర్మన్‌ తేదీ నిర్ణయించకుండా తామెలా నిర్వహిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులు చెప్పడం విశేషం.

ప్రజల ఇబ్బందులను పక్కనపెట్టి

పచ్చ నేతల పంతాలు

అభివృద్ధి పనులను

అడ్డుకుంటున్న మున్సిపల్‌ చైర్మన్‌

ఏకపక్ష నిర్ణయాలతో

సమావేశానికి కౌన్సిలర్లు గైర్హాజరు

కోరం సరిపోదనే సమావేశాల

నిర్వహణకు దూరం

నగరంలోని

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న

రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఈవూరు గణేష్‌, పార్టీ

నేతలు

వైఎస్సార్‌సీపీ వారిపై మరింతగా...

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలకు కోరం కొరత వేధిస్తోంది. పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు, ప్రగతి ప్రణాళికలు రూపొందించడానికి కౌన్సిల్‌ సభ్యుల ఆమోదం తప్పనిసరి. అయితే అసలు కౌన్సిల్‌ సమావేశం సజావుగా జరిగేందుకు, అజెండాలోని అంశాల ఆమోదానికి కౌన్సిలర్లు ముందుకు రావడం లేదు. కోరం సరిపోక కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి.

‘పచ్చ’ పంతాలకు పడకేసిన ప్రగతి1
1/1

‘పచ్చ’ పంతాలకు పడకేసిన ప్రగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement