అంబటి రాంబాబు ఇంటిపై దాడి హేయం | - | Sakshi
Sakshi News home page

అంబటి రాంబాబు ఇంటిపై దాడి హేయం

Feb 1 2026 3:23 AM | Updated on Feb 1 2026 3:23 AM

అంబటి

అంబటి రాంబాబు ఇంటిపై దాడి హేయం

అంబటి రాంబాబు ఇంటిపై దాడి హేయం అమానుష చర్య..

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడి హేయమైన చర్య. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే ఉద్దేశపూర్వకంగా ఇంటిలోకి చొరబడి దాడులు చేయడం సరికాదు. వ్యక్తిగత దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరగడం సహించకూడదు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులు, కక్షసాధింపు చర్యలు పెరిగాయి. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు.

– కరణం వెంకటేష్‌,

వైఎస్సార్‌ సీపీ చీరాల సమన్వయకర్త

అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం అమానుష చర్య. రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న వివాదాలను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప నివాస గృహాలపై దాడి చేయడం సమంజసమైన చర్య కాదు. కుటుంబంలో మహిళలు, చిన్నారులు ఉంటారని వారిని భయాందోళనకు గురి చేయడం సరి కాదు. ఇటువంటి అమానుష చర్యలను ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– గాదె మధుసూదనరెడ్డి,

వైఎస్సార్‌ సీపీ పర్చూరు సమన్వయకర్త

అంబటి రాంబాబు ఇంటిపై దాడి హేయం 
1
1/1

అంబటి రాంబాబు ఇంటిపై దాడి హేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement