వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు

Feb 1 2026 3:23 AM | Updated on Feb 1 2026 3:23 AM

వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు

వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు

బాపట్ల: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి బాపట్ల సేవ సేతు వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. వెబ్‌సైట్‌ అమలు తీరుపై శనివారం స్థానిక కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. చీరాల బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినుల కోసం కొనుగోలు చేసిన 18 బెడ్‌ రోల్స్‌ విరాళంగా ఇస్తూ రసీదును సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారిణికి కలెక్టర్‌ అందజేశారు. ప్రజలకు అవగాహన కల్పించడానికే తానే తొలి విరాళం ఇచ్చానని చెప్పారు. ఇప్పటివరకు 491 రకాల వస్తువులు, అవసరాలను గుర్తించి వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేశామన్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సత్యనారాయణ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement