ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
బాపట్ల: ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీర పాండియన్ తెలిపారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌తో కలసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలకుపైగానే తనిఖీలు కొనసాగించారు. ఓపీ, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌లో రక్త పరీక్షల నిర్వహణను పరిశీలించారు. డి చంద్రమోహన్ అనే వ్యక్తి వైద్య పరీక్షలకు రాగా అతని పేరు రిజిస్ట్రేషన్ ప్రారంభం నుంచి వైద్యం ముగిసే వరకు ఆయన పక్కనే ఉండి వైద్యం ఎలా అందుతుందని పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖలో అమలయ్యే వివిధ యాప్‌ల పనితీరుపై ఆరా తీశారు. రోగులకు అవసరమైన ఔషధాలను వైద్య అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఔషధాల పంపిణీ, నిల్వలను పరిశీలించారు. వైద్య సిబ్బంది ఆన్‌లైన్‌లో వేస్తున్న ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును పరిశీలించారు. ఒక్కొక్కరిని పిలిచి పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎం.ఏడుకొండలురెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, కె.ఏడుకొండలరెడ్డిలతో మా ట్లాడారు. వారిని పలు ప్రశ్నలు వేసి అభిప్రాయా లు సేకరించారు. వారి వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, వైద్య అధికారులు ఉన్నారు.


