సారస్‌ మస్కట్‌గా గుంటూరు మిర్చి | - | Sakshi
Sakshi News home page

సారస్‌ మస్కట్‌గా గుంటూరు మిర్చి

Dec 31 2025 7:19 AM | Updated on Dec 31 2025 7:19 AM

సారస్

సారస్‌ మస్కట్‌గా గుంటూరు మిర్చి

గుంటూరువెస్ట్‌: సారస్‌ (సేల్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఆర్టిసన్స్‌ సొసైటీ) మస్కట్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా మంగళవారం కలెక్టరేట్‌లో విడుదల చేశారు. సారస్‌ను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. గుంటూరు మిరపకు ప్రసిద్ధి కావడంతో ‘మిరప కాయ’నే ఎంపిక చేసి మస్కట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్థానిక రెడ్డి కళాశాల ఎదుట ఉన్న స్థలంలో జనవరి 6 నుంచి 18 వరకు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి సారస్‌ కార్యక్రమం జరుగుతుండడం విశేషమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్‌ ఖాజావలి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజన సింహ, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డి.ఆర్‌.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రూ.8.20 కోట్ల విలువైన మద్యం కొనుగోలు

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌) : కొత్త ఏడాది వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీలలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మందుబాబులు ఖుషీ ఖుషీ అవుతున్నారు. జిల్లాలో మంగళవారం రాత్రి మద్యం డిపోల నుంచి రూ.8.20 కోట్ల విలువైన మద్యం కేసులను వైన్‌ షాపు, బార్‌,రెస్టారెంట్‌ నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఈ మొత్తం 31వ తేదీ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మరో పక్క ఎకై ్సజ్‌ అధికారులు ప్రత్యేకంగా టార్గెట్లు ఇచ్చి మద్యం అమ్మకాలు జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్‌ వేడుకల నిర్వహణకు అనుమతులు కోరుతూ మంగళవారం రాత్రి వరకు గుంటూరు నగర పరిధిలో రెండు, మంగళగిరి పరిధిలో ఐదు దరఖాస్తులు వచ్చాయని ఎకై ్సజ్‌ అధికారులు చెబుతున్నారు.

ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీలు

6ఏ కేసు నమోదు..అమ్మకాలు నిలుపుదల

నకరికల్లు: ఎరువుల దుకాణాల్లో అమ్మకాలకు సంబంధించిన పత్రాలు లేకుంటే కేసులు నమోదు చేస్తామని ఏడీఏ పి.మురళీకృష్ణ హెచ్చరించారు. పల్నాడు జిల్లా నకరికల్లులోని మహిత ట్రేడర్స్‌లో మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు తనిఖీ చేసి ఎరువుల నిల్వలు పరిశీలించారు. పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం ఆయన మాట్లాడుతూ లైసెన్స్‌కు ఫాం–ఓ జత చేయని కారణంగా రూ.14.09 లక్షల విలువ గల 54.8 మెట్రిక్‌ టన్నుల యూరియా, డీఏపీ, 15–15–15 ఎరువుల అమ్మకాలు నిలుపుదల చేశామన్నారు. అలాగే రూ.78,500 విలువ గల 7.85 మెట్రిక్‌ టన్నుల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ ఎరువులను సీజ్‌ చేసి 6–ఏ కేసు నమోదు చేశామన్నారు. అనంతరం చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట కమిషనరేట్‌ ఏఓ కె.వెంకటరావు, స్థానిక ఏఓ కె.దేవదాసు, సిబ్బంది ఉన్నారు.

నేడు రెవెన్యూ డివిజన్‌

కార్యాలయం ప్రారంభం

అద్దంకి రూరల్‌: అద్దంకి డివిజన్‌ ఏర్పాటులో భాగంగా నూతన డివిజన్‌ కార్యాలయం బుధవారం ఉదయం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ప్రారంభించనున్నట్లు రెవెన్యూ అధికారులు మంగళవారం తెలిపారు. ప్రస్తుత ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, అద్దంకికి ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు.

జాతీయ షూటింగ్‌లో ముఖేష్‌కు మరో రజతం

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీ ల్లో గుంటూరుకు చెందిన నేలవల్లి ముఖేష్‌ మరో రజత పతకం సాధించాడని నేలవల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ జూని యర్‌ విభాగంలో ముఖేష్‌ 569/600 పాయింట్లతో మంగళవారం మరో రజత పతకం సాధించినట్లు తెలిపారు. ఒక్క పాయింట్‌ తేడా తో బంగారు పతకం చేజారిపోయిందన్నారు. ముఖేష్‌ను పలువురు అభినందించారు.

సారస్‌ మస్కట్‌గా గుంటూరు మిర్చి 1
1/2

సారస్‌ మస్కట్‌గా గుంటూరు మిర్చి

సారస్‌ మస్కట్‌గా గుంటూరు మిర్చి 2
2/2

సారస్‌ మస్కట్‌గా గుంటూరు మిర్చి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement