మేదరమెట్ల విద్యార్థుల ప్రాజెక్టుకు స్టేట్ ఫస్ట్
మేదరమెట్ల: విజయవాడలో నిర్వహించిన స్టేట్‌లెవెల్ స్కిల్ కాంపిటిషన్‌లో మేదరమెట్ల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం గెలుచుకుంది. ఈ ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులు షేక్ మెహసీనా కౌసర్, జి.హర్షిణి, జి.కీర్తన, సీహెచ్ దివ్య.. గైడ్‌చేసిన టీచర్ కె.రమ్యలతలను ప్రధానోపాధ్యాయులు అంజనీదేవి.. ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. ప్రథమ స్థానం గెలుచుకున్న విద్యార్థులు రూ.25వేల నగదు బహుమతి కూడా విజయవాడలో అందుకున్నట్లు హెచ్‌ఎం తెలిపారు.


