మహిళ మెడలో ఆభరణాల చోరీ
అద్దంకి: వైకుంఠ ఏకాదశికి పట్టణంలోని మాధవ స్వామి దేవస్థానంలో దైవ దర్శనం చేసుకుని వెళ్తున్న ఓ మహిళ మెడలో బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అపహరించారు. పట్టణానికి చెందిన అమరా సుశీల తన భర్త శ్రీరాములుతో కలిసి దేవస్థానికి వెళ్లి దైవ దర్శనం తరువాత ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆమె మెడలోని బంగారు నానుతాడు, నల్లపూసల గొలుసు, ముత్యాల దండ గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లినట్లు బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. అయితే ముత్యాల గొలుసు మాత్రం అక్కడే పడినట్లు గుర్తించినట్లు సీఐ తెలిపారు.


