క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ బలోపేతమే లక్ష్యం
యద్దనపూడి: వైఎస్సార్ సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయటానికి గ్రామస్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి తెలిపారు. పర్చూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మోదుగుల బసవ పున్నారెడ్డితో సోమవారం ఆయన కలిసి మండలంలోని శ్యామలవారిపాలెం, పోలూరు, జాగర్లమూడి, మున్నంగివారిపాలెం, తనుబొద్దివారిపాలెం, గన్నవరం, పూనూరు గ్రామాల్లో పర్యటించారు. కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
● గాదె మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ కమిటీల నియామకంలో బంధుప్రీతి, వ్యక్తిగత స్వార్థంతో రాజకీయాల కోసం కాకుండా వైఎస్సార్ సీపీపై చిత్తశుద్ధి ఉన్న వారిని మాత్రమే కమిటీల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. విస్తృతంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్‌తో ఐడీ కార్డులను మంజూరు చేస్తారని, భవిష్యత్‌లో కమిటీ సభ్యులకు అన్ని విధాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
● పార్టీ పరిశీలకులు మోదుగుల బసవ పున్నారెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
● కార్యక్రమంలో మండల కన్వీనర్ రావూరి వేణుబాబు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మువ్వల రాంబాబు, షేక్ బుడే, ధూళ్లిపాళ్ల శివకుమారి, కుంచపు అంకమ్మ, బొబ్బేపల్లి శ్రీకాంత్, యన్నం శ్రీను, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి కృష్ణారెడ్డి, దొడ్డా రవి, తనుబొద్ది రామిరెడ్డి, మున్నంగి బసివిరెడ్డి, గనిపిశెట్టి రమేష్‌బాబు, ఈమని శేషిరెడ్డి, గనిపిశెట్టి రామకృష్ణ, షేక్ ఖాసింవలి, రావూరి వీరయ్యచౌదరి, తనుబొద్ది రామిరెడ్డి, వీరారెడ్డి, చల్లా అన్నపూర్ణమ్మ, వెంకటరెడ్డి, చెరుకూరి వేణు, మేకా సుధాకర్, దేవగిరి సుబ్బారెడ్డి, నాగూర్ బాషా, లక్ష్మయ్య, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ గాదె మధుసూదన్‌రెడ్డి, పార్టీ పరిశీలకుడు బసవ పున్నారెడ్డి


