జిల్లాలో 373 మొబైల్ ఫోన్లు స్వాధీనం
●జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
●రూ. 74.60 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అప్పగింత
బాపట్ల టౌన్: జిల్లాలో గత మూడు నెలల్లో ఇటీవల రూ. 74.60 లక్షల విలువైన 373 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సోమవారం బాధితులకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అందజేశారు. జిల్లా క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.7,17,80,000 విలువైన 3,301 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు చెప్పారు. ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్‌గా విక్రయించేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని కొనవద్దని ఆయన సూచించారు. మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయడానికి జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే, దాని ఐఎంఈఐ నంబర్లు, దానికి సంబంధించిన బిల్లుతో పోలీస్ స్టేషన్లలో లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయవవ్చని తెలిపారు.


