ఏపీటీఎఫ్ డైరీ, కేలండర్ ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీటీఎఫ్ నూతన సంవత్సర కేలండర్, డైరీని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. జీవో ప్రతులతో కూడిన ఉపాధ్యాయ మార్గదర్శినిని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్‌బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ప్రభుత్వ జీవోలు, సర్వీసు నియమ, నిబంధనలతో ఉపాధ్యాయులకు కరదీపికగా ఉంటుందని తెలిపారు. గత 50 ఏళ్లుగా నిరాటంకంగా ఉపాధ్యాయ, విద్యారంగ విషయాలతో జీవో పుస్తకాన్ని ప్రచురించడం గొప్ప విషయమని, ఇది ప్రతి ఉపాధ్యాయుని చేతిలో ఉండాల్సిన పుస్తకమన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, గుడిపాటి దాస్, కార్యదర్శులు పి.లక్ష్మీనారాయణ, చక్కా వెంకటేశ్వరరావు, పచ్చల శివరామకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్ కె.రమేష్, నాయకులు జహంగీర్, కిశోర్ షా, కృష్ణారావు, మునినాయక్, షుకూర్, అప్పారావు, మాల కొండయ్య పాల్గొన్నారు.


