తీరంలో సండే సందడి
చీరాల టౌన్: మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో కోలాహలంగా మారింది. వివిధ గ్రామాల ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వాడరేవు తీరానికి చేరుకున్నారు. వరుస సెలవులు కావడంతో చిన్నారులు, యువకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ సముద్రంలో స్నానమాచరించి ఆనందోత్సాహాలతో సందడి చేశారు. తీరం ఒడ్డున యువకులు సేదతీరుతూ సముద్రపు మన్నుతో ఆటలాడుతూ కడలి చెంత సంతోషంగా గడిపారు. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలతోపాటుగా పల్నాడు జిల్లాలోని పలుప్రాంతాలు, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెదిన ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వాడరేవు చేరుకుని స్నానాలు ఆచరించి తీరంలో సరదాగా గడిపారు. దీంతో వాడరేవులో కోలాహలం నెలకొంది.


