నేడు యోగాసన చాంపియన్‌షిప్ బహుమతుల పంపిణీ
బాపట్లటౌన్: మండలంలోని జిల్లెళ్లమూడి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మూడు రోజుల నుంచి జరుగుతున్న జాతీయస్థాయి యోగాసన చాంపియన్– 2025 బహుమతుల ప్రదానోత్సవం సోమవారం జరుగుతుందని రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ కళ్లం హరినాఽథ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన క్రీడాశాఖల మంత్రి ఎం. రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మ, మద్దులూరి మాల కొండయ్య, ఏలూరి సాంబశివరావు, శాప్ చైర్మన్ అనుమల రవి నాయుడు, స్టేట్ యోగా అసోసియేషన్ అధ్యక్షులు కూన కృష్ణదేవరాయులు, యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు.
బాపట్ల: ఏపీ టీచర్స్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా శాఖ జనరల్ కౌన్సిలర్ సమావేశం బాపట్ల ప్రొడీజీ విద్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు అమృతపూడి శేఖర్‌బాబు అధ్యక్షత వహించారు. కార్యదర్శి నివేదిక ఏకగ్రీవంగా ఆమోదం పొందిన అనంతరం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా అమృతపూడి శేఖర్‌బాబు, ఉపాధ్యక్షులుగా మడుగుల కిషోర్, ఈర్షద్, పి. వెంకటేశ్వరరావు, కే శ్రీనివాసరావు, గోవా రవి, ప్రధాన కార్యదర్శిగా పీడీ సోషలిజం, కార్యదర్శులుగా కేవీ నారాయణ, దాసరి కృష్ణవేణి, వై చెన్నకేశవులు, ిసీహెచ్ శ్రీనివాసరావు, జె శ్రీనివాసరావు, కె వెంకటేశ్వరరెడ్డిలను ఎన్నుకున్నారు.
●వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
●రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేత
పట్నంబజారు: రక్తదానం ప్రాణదానంతో సమానం అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదానం చేసిన వారికి ఆదివారం ప్రశంసా పత్రాలు అందజేశారు. బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నేతలు, కార్పొరేటర్లు , అనుబంధ విభాగాల అధ్యక్షులతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన శిబిరంలో 240 మంది రక్తదానం చేశారని, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నగరంపాలెం: ప్రకృతి సమాజ చిత్రాలు యరగ్రుంట్ల పాణిరావు కవితలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. బ్రాడీపేట కొరటాల సమావేశ మందిరంలో ‘నీరెళ్లిపోతున్నా నది నాతోనే’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. అమరావతి సాహితీ మిత్రులు అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు అధ్యక్షత వహించారు. యరగ్రుంట్ల పాణిరావు కవితల సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జీవ లక్షణం ఉన్న కవి పాణిరావు అని అన్నారు. జ్ఞాపకాలను చాలా అందంగా చిత్రించారని చెప్పారు. మానవ సంబంధాలను అద్భుతమైన భావుకత జోడించి బాగా చెప్పారని పేర్కొన్నారు. సాహితీవేత్త అబ్దుల్ రజాహుస్సేన్ మాట్లాడుతూ ప్రజలను మేలుకొలిపే కవిత్వంగా ఉందన్నారు. చక్కని ఆలోచనలు ఉన్న కవిత్వంగా, మంచి కవిత్వం అందించిన కవి అని కొనియాడారు. ప్రత్యేక అతిథిగా విమల సాహితీ వేదిక(హైదరాబాద్) అధ్యక్షులు డాక్టర్ జెల్ది విద్యాధరరావు మాట్లాడుతూ నవ్యత, మానవత, ఆకుపచ్చని జ్ఞాపకాలతో కవిత్వ సంపుటి పరిమళాలు వెదజల్లుతూ ఉందని అన్నారు. అనంతరం కవి యరగ్రుంట్ల పాణిరావుని సత్కరించారు. సభలో సురేష్, జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు, సాహితీ ప్రియులు, బంధువులు పాల్గొన్నారు, తొలి ప్రతిని కవి తన సోదరి వాణీ సుమకు అందించారు.
లక్ష్మీపురం: 104 ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఆయన కార్యాలయంలో ఆదివారం కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అరబిందో నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం అన్యాయని తెలిపారు. ప్రస్తుత భవ్య యాజమాన్యం కూడా ఇప్పటివరకు నియామక పత్రాలు గానీ, పే స్లిప్స్ కూడా ఉద్యోగులకు అందజేయలేదని వివరించారు. ఈ విషయాలపై చర్చించి న్యాయం చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ హర్ష, నాయకులు హరి, విజయ్ పాల్గొన్నారు.
నేడు యోగాసన చాంపియన్‌షిప్ బహుమతుల పంపిణీ
నేడు యోగాసన చాంపియన్‌షిప్ బహుమతుల పంపిణీ


