బైకు నుంచి పడి నవ వరుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బైకు నుంచి పడి నవ వరుడు మృతి

Dec 29 2025 7:58 AM | Updated on Dec 29 2025 7:58 AM

బైకు

బైకు నుంచి పడి నవ వరుడు మృతి

బైకు నుంచి పడి నవ వరుడు మృతి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌ 10, 11 తేదీల్లో యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు నెలాఖరుతో అదనపు లోడు చెల్లింపుల గడువు ముగింపు

బల్లికురవ ఎస్సీ కాలనీలో విషాదఛాయలు

బల్లికురవ: అత్తగారింటికి బైకుపై బయలుదేరిన నవ వరుడు రోడ్డు మార్జిన్‌లోని కాలువలో బైకు సహా పడి చనిపోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి బల్లికురవ–కొమ్మాలపాడులోని ఆర్‌ అండ్‌ బీ రోడ్డులోని చెన్నుపల్లి గ్రామ సమీపంలో జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. బల్లికురవ ఎస్సీ కాలనీకి చెందిన అమర్తపూడి కోటేశ్వరరావు, మేరమ్మ దంపతుల ఏకై క కుమారుడు ప్రశాంతకుమార్‌ (18)కి ఇటీవలే సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన అలేఖ్యతో వివాహం అయింది. ఏఎంఆర్‌ చెక్‌పోస్టులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైకుపై వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆదివారం చెన్నుపల్లి గ్రామస్తులు రోడ్‌ మార్జిన్‌లోని కాలువలో యువకుడు పడి ఉండటాన్ని గమనించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి చనిపోయినట్లుగా ప్రకటించారు. ఎస్సై వై.నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏకై క కుమారుడు, నవవరుడు చనిపోవటతో ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

రూ.ఐదు లక్షల విలువైన సొత్తు స్వాధీనం

తెనాలి రూరల్‌: పలు చోరీ కేసులలో నిందితుడిని పట్టణ వన్‌టౌన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. నిందితుడు నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మల్లికార్జునరావు వెల్లడించిన వివరాల ప్రకారం... గుంటూరు కాకాని రోడ్డుకు చెందిన సయ్యద్‌ ఖాజా ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో అతనిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పట్టణంలో ఆటో చోరీకి గురైన నేపథ్యంలో కేసు నమోదు చేసిన వన్‌ టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడింది ఖాజా అని గుర్తించి నిందితుడిని వైకుంఠపురం ఆలయం సమీపంలో ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు నుంచి తెనాలి వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌, పాత గుంటూరు స్టేషన్‌లలో నమోదైన కేసులకు సంబంధించి రెండు ఆటోలు, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో మొబైల్‌ ఫోన్‌, పెదకాకాని, తాడేపల్లి పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఐ కె.విజయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) రాష్ట్ర 51వ కౌన్సిల్‌ సమావేశాలను జనవరి 10, 11 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు ఆ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ హాలులో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యారంగ సమస్యలతోపాటు, ఉపాధ్యాయులపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపైన చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. 10న బహిరంగసభ, ఉపాధ్యాయుల ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఫెడరేషన్‌ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎన్‌.కుసుమ కుమారి, రాష్ట్ర ప్రచరణల కమిటీ చైర్మన్‌ ఎం.హనుమంతరావు మాట్లాడారు. జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి మహమ్మద్‌ గయా సుదౌలా, జిల్లా కార్యదర్శులు ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, రంగారావు, కామాక్షి, ప్రసాద్‌, కేదార్నాథ్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

నరసరావుపేట: వినియోగదారులు తమ గృహావసరాలకు ఇచ్చిన అనుమతికంటే అదనంగా విద్యుత్‌ వినియోగించుకుంటున్న వారు 50 శాతం రాయితీతో అదనపు రుసుం చెల్లించేందుకు ఏపీసీపీడీసీఎల్‌ ఇచ్చే గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. అదనంగా వాడుకునేవారు ఒక కిలోవాట్‌కు పాత ధర రూ.2250 కాగా నూతన ధర రూ.1250 చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఒక కిలోవాట్‌కు రూ.1000 రాయితీ కల్పిస్తుంది. ఈ విధంగా రెండు కిలోవాట్‌లకు రూ.2వేలు, మూడు కిలోవాట్లకు రూ.3వేలు, నాలుగు కిలోవాట్లకు రూ.4వేలు, ఐదు కిలోవాట్లకు రూ.5వేలు రాయితీ లభిస్తుంది. వినియోగదారులు తమకు కావాల్సిన స్లాబును ఎంపిక చేసుకొని సమీప ఎలక్ట్రికల్‌ రెవెన్యూ ఆఫీసు, ఈ సేవ కేంద్రం, సంస్థ వెబ్‌సైట్‌కు చార్జీలు చెల్లించాలని ఆశాఖ అధికారులు కోరుతున్నారు.

ప్రశాంత కుమార్‌

మృతదేహం

ప్రశాంత కుమార్‌ (ఫైల్‌)

బైకు నుంచి పడి  నవ వరుడు మృతి 1
1/2

బైకు నుంచి పడి నవ వరుడు మృతి

బైకు నుంచి పడి  నవ వరుడు మృతి 2
2/2

బైకు నుంచి పడి నవ వరుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement