బరి తెగించిన టీడీపీ నాయకులు
నగరం: అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు బరి తెగిస్తున్నారు.రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని నగరం శివారు ఎస్టీ కాలనీకి (యానాది)చెందిన ఎస్. రాజశేఖర్‌పై ఆదివారం దాడి చేశారు. అధికారంలో ఉండగా నివేశన స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించామని, తమ పార్టీకి కాకుండా వేరే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారా ? అని టీడీపీ నాయకులు దాడి చేశారని రాజశేఖర్ వాపోయాడు. కాలనీలో అభివృద్ధి పనులు గురించి మాట్లాడాలని ఎస్టీ కాలనీ వాసుల పెద్దలను పిలవడంతో నగరం గౌడపాలెం వెళ్లామని తెలిపాడు. అక్కడకు వెళ్లగానే టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారని రాజశేఖర్ కన్నీటిపర్యంతమయ్యాడు. టీడీపీకి అనుకూలంగా లేకపోతే ఎస్టీ కాలనీని ఖాళీ చేయాలని హకుం జారీ చేయడంతో ఎస్టీలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వైఎస్సార్ సీపీ నాయకులను పిలవడం వల్లే టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. దీనిపై ఎస్‌ఐ భార్గవ్‌ను వివరణ కోరగా తాను వాహనాల తనిఖీలో ఉన్నానని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత బాధితుల నుంచి కేసు తీసుకుంటానని తెలిపారు.
ఎస్టీ కాలనీ నివాసులకు బెదిరింపులు
కాలనీకి చెందిన రాజశేఖర్‌పై దాడి
ఇతర పార్టీలకు అనుకూలంగా ఉంటే ఖాళీ చేయాలని హుకుం
కాలనీని వదిలి వెళ్లేందుకు
సిద్ధమైన ఎస్టీలు


