ఫిబ్రవరి 5న జరిగే మహాసభను విజయవంతం చేయాలి
బాపట్ల: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై విజయవాడలో ఫిబ్రవరి 5న జరిగే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జరిగిన ఏపీ జేఏసీ బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశానికి బొప్పరాజు హాజరయ్యారు. జిల్లా జేఏసీ చైర్మన్ సీహెచ్.సురేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో 2026 ఫిబ్రవరి 5న జరిగే మహాసభకు రాష్ట్రంలో 92 డిపార్టుమెంట్‌లకు చెందిన సంఘాల సభ్యులు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ప్రధానకార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి, వీఆర్వోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోన ఆంజనేయకుమార్, నాలుగో తరగతి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.మల్లేశ్వరరావు, జి.అనుపమ, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య, ఏపీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రజనీకాంత్, అసోసియేట్ చైర్మన్ బి.టి.వలి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు పి.రజని, కార్యదర్శి యస్.కె.హజరాబేగం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షులు సుమన్, కో–ఆపరేటివ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు


