ఈవీఎం గోదాములను భద్రంగా ఉంచాలి
గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలి
గ్రామ, వార్డు సచివాలయాలు భవనాల నిర్మాణం 2026 జనవరి 31నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ మినీ వీసీ హాలులో గ్రామ, వార్డు సచివాలయ భవనాల నిర్మాణ పనులు, ఈకేవైసీ, ఏపీ సేవ పేమెంట్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి బాల బాలికలు, టీచర్లు పాఠశాలలకు హాజరు, ఎంఈఓలు పాఠశాల తనిఖీ, ఎంబీయూ, మధ్యాహ్నం భోజనం, తల్లికి వందనం, వివిధ అంశాలపై ఎంపీడీఓలు, ఎంఈ ఓ 1– 2లు, గ్రామ, వార్డు సచివాలయాల అధికారుల తో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈకేవైసీ, ఏపీ సేవ పేమెంట్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నా రు. బాలబాలికలు వంద శాతం పాఠశాలలకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను వారానికి రెండు రోజులు తనిఖీ చేయాలన్నారు. తల్లికి వందనం పథకం ఇంకా జిల్లాలో కొందరికి రాలేదని, ఏ కారణం చేత తల్లికి వందనం రాలేదో పరిశీలించి వంద శాతం పూర్తి చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. వ్యక్తిగత కారణాలతో పనులు పెండింగ్ పెడితే బాధ్యులపై చర్య లు తీసుకుంటామని తెలిపారు. డీఎల్‌డీఓ విజయలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, డిప్యూటీ డీఈఓలు, పీఆర్ ఈఈ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


