మార్టూరు పంచాయతీ కార్మికుల విధులు బహిష్కరణ
మార్టూరు: స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులు శుక్రవారం నుంచి నిరవధికంగా విధుల బహిష్కరణ చేపట్టారు. నలుగు నెలల పెండింగ్ జీతాలు మంజూరు కోరుతూ ఆందోళన బాట పట్టారు. మార్టూరు పంచాయతీ కార్యాలయంలో నిరసన కార్యక్రమంలో కార్మికులు మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగకు ఒక రోజు ముందు వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇచ్చిన మాటపై నిలబడలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌స్టాల్ మెంట్‌పై బైకులు కొనుగోలు చేసిన 8 మంది వాహనాలు కిస్తీలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు తమ వాహనాలను జప్తు చేసినట్లు కార్మికులు వాపోయారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును వివరణ కోరగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వేతనాలు ట్రెజరీకి పంపించామని త్వరలో వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. మార్టూరుకు చెందిన 50 మంది పంచాయతీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.


