ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
బొల్లాపల్లి: నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.హనుమంత రావు బుధవారం బండ్లమోటు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతలు, నేరాల దర్యాప్తు గురించి సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ... పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న పికిలి చంటిని బండ్లమోటు స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడి నుంచి రూ. 10 లక్షల విలువైన 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితుడిపై పలు చోట్ల 43 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బండ్లమోటు స్టేషన్ పరిధిలో మరో 19 కేసులు నమోదు చేశామన్నారు. బైకుల యజమానులు స్థానిక ఎస్సైని సంప్రదించాలని సూచించారు. సమావేశంలో వినుకొండ రూరల్ సీఐ బి. బ్రహ్మయ్య, బండ్లమోటు ఎస్‌ఐ సయ్యద్ సమీర్ బాషా, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు


