బైక్ దొంగల ముఠా..
యడ్లపాడు: బైకుల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను యడ్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.3.70 లక్షల విలువైన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ బి.సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. యడ్లపాడు జాతీయ రహదారి ఉప్పరపాలెం అండర్ పాస్ వంతెన వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులు వివరాలు అడిగేలోగా బైక్‌ను వదిలి కొందరు పరారయ్యారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. నిందితులు చిలకలూరిపేటకు చెందిన పోలిశెట్టి మహేష్ బాబు, చిలక విఘ్నేష్ (సన్నీ), పల్లపు ఆంజనేయులులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ టి.శివరామకృష్ణ, ఏఎస్‌ఐ ఇస్మాయిల్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హెచ్‌జీ జె.సాంబశివరావులను ఉన్నతాధికారులు అభినందించారు.


