బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Nov 26 2025 6:51 AM | Updated on Nov 26 2025 6:51 AM

బాపట్

బాపట్ల

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 రైతులను వెన్నాడుతున్న తుపాను భయం పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం జిల్లాలో ముందుకు సాగని ధాన్యం సేకరణ వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో పదిరోజులుగా వరి కోతలు 74 రైస్‌ మిల్లులు ఎంపిక చేసినా బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చింది అరకొరే దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్న రైతులు ముందస్తు చర్యలు లేకనే కొనుగోళ్లలో కనిపించని పురోగతి ప్రభుత్వ తీరుతో గగ్గోలు పెడుతున్న రైతులు

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
రైతులను వెన్నాడుతున్న తుపాను భయం

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు 3,711 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3600 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 43.0610 టీఎంసీలు.

సాక్షి ప్రతినిధి,బాపట్ల: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం పుణ్యమా అని జిల్లాలో ధాన్యం సేకరణ ముందుకు సాగడంలేదు. వరికోతలు మొదలై పది రోజులు దాటుతున్నా.. ప్రభుత్వం పట్టుమని పది టన్నుల ధాన్యం కూడా సేకరించలేదు. ఫలితంగా రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు. ధాన్యం సేకరణపై వివరాలు చెప్పేందుకు పౌరసరఫరాల విభాగం మేనేజరు ససేమిరా అంటున్నారు. ఎన్ని కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు? ఎంతమంది మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు సేకరించారన్న విషయంపై అధికారులు స్పందించడంలేదు. రైతుల నుంచి శాంపిల్స్‌ తీసుకునేవారు లేరు, మిగిలిన ప్రాసెస్‌ పూర్తిచేసేవారు కరువయ్యారు. గోతాలు సకాలంలో అందించడం లేదు. టార్ఫాలిన్‌ పట్టలు లేవని అధికారులు తప్పించుకుంటున్నారు. ధాన్యం సేకరణ వ్యవహారాన్ని సజావుగా జరిగేలా చూడాల్సిన ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ధాన్యం సేకరణ బాధ్యతలు చూస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన, మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌లు శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. మొత్తం వ్యవహారాన్ని పౌర సరఫరాల డీఎం, ఇతర అధికారులపై నెట్టడంతో వారు ధాన్యం సేకరణపై దృష్టి పెట్టడంలేదు. పది రోజులుగా వరికోతలు జరుగుతున్నా మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు సేకరించక పోవడం చూస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. 20 రోజుల నుంచి ధాన్యాం సేకరణ కేంద్రాలు పెడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం కోతలు పది రోజుల కిందట మొదలైనా ఇప్పటికీ పట్టుమని పది టన్నుల ధాన్యం సేకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వర్షం వచ్చే సూచనలు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వేమూరులో యాభై శాతం కోతలు పూర్తి

వేమూరు నియోజకవర్గంలో వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం 78,099 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అనధికారికంగా 95వేల ఎకరాల్లో వరి సాగైనట్లు సమాచారం. మొత్తం వరి కోత దశ లో ఉండగా, గడచిన పది రోజుల్లో సుమారు 50 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. రేపల్లె నియోజకవర్గంలో అధికారికంగా 83,623 ఎకరాల్లో వరి సా గు కాగా, చెరుకుపల్లి మండలంలో వరి కోత దశలో వుంది. వారం రోజుల నుంచి కోతలు కోస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. నెలరోజుల ముందునుంచే ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలు పెడుతున్నామంటూ జిల్లా అధికారులు ఆర్భాటం చేశారు. కానీ కిందిస్థాయి అధికారులు, రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు లేదు. కోతలు మొదలయ్యే నాటికి బ్యాంకు గ్యారెంటీల తంతు ముగించి మిల్లులను సిద్ధంగా ఉంచుకునే వ్యవహారం పూర్తిచేయలేదు. కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌, జేసీ భావనలు హడావుడి చేయడం తప్ప ధాన్యం సేకరణ ప్రక్రియ సక్రమంగా జరిగేందు కు సరైన ప్రణాళిక సిద్ధం చేయలేదు. వరికోతలు మొదలైన పదిరోజులకు కూడా ధాన్యం సేకరణ ప్రా రంభించలేదు. దీనివల్ల రైతులు ఎకరాకు రూ.12 వేల కు తగ్గకుండా నష్టపోవాల్సి వస్తోంది. తక్కువ ధరకు ధాన్యం అమ్మితే కౌలు, పెట్టుబడి ఖర్చులు కూడా రా వని అన్నదాతలు వాపోతున్నారు. కలెక్టర్‌, జేసీలు స్పందించి ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలన్నారు.

7

జిల్లా వ్యవసాయ అధికారిణి అన్నపూర్ణ

అల్పపీడన ప్రభావంతో ఐదు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం కురిస్తే నష్టపోతామని ఆందోళన చెందిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ప్రభుత్వం ఽకొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. సోమవారం వరకూ గోతంతో కలిపి 76 కిలోల ధాన్యం బస్తా రూ.1400 నుంచి 1460 వరకూ కొన్న మిల్లర్లు మంగళవారం నుంచి బస్తా ధాన్యం రూ.1300లకు అడుగుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడం, వర్షం వచ్చే సూచనలు ఉండడంతో ఇదే అవకాశంగా దళారులు తక్కువ ధరకు ధాన్యం కొట్టేసేందుకు సిద్ధమయ్యారు.

బాపట్ల1
1/6

బాపట్ల

బాపట్ల2
2/6

బాపట్ల

బాపట్ల3
3/6

బాపట్ల

బాపట్ల4
4/6

బాపట్ల

బాపట్ల5
5/6

బాపట్ల

బాపట్ల6
6/6

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement