డిసెంబర్ 2 వరకు సముద్రంలో వేట నిషేధం
చీరాల టౌన్: అండమాన్ నికోబార్ దీవుల్లో వాయుగుండం తుఫాన్‌గా మారడంతో వాతావరణ శాఖల హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని వాడరేవు గ్రామంలో మత్స్యకారులు డిసెంబర్ 2 వరకు సముద్రంలో వేట నిషేధించామని తహసీల్దార్ కె.గోపీకృష్ణ తెలిపారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని, వేట సామగ్రిని సురక్షిత ప్రాంతంలో భద్రపరుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలానే ఇతర ప్రాంతాలకు వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి వాడరేవుకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
తాడేపల్లిరూరల్: ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని ఆర్‌జేడీ పద్మ అన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలలో విద్యార్థు ల ఉత్తీర్ణత శాతాన్ని పెంచటానికి ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టిన సంకల్ప్–2026 అమలును పర్య వేక్షించటానికి మంగళవారం పెనుమాక ప్రభు త్వ జూనియర్ కళాశాలను ఆర్‌జేడీ ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి తరగతిని పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్‌ఆర్‌కేవీఎం పథ కం ద్వారా విద్యార్థులకు ఉచిత నీట్, జేఈఈ మెటీరియల్ అందజేశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కళా శాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరావు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆర్‌జేడీ పద్మను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు.
అచ్చంపేట: తాడువాయిలో కంది పంటను క్రోసూరు వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మస్తానమ్మ, ఏవో పి.వెంకటేశ్వర్లుతో కలసి మంగళవారం పరిశీలించారు. కంది పంటను ఆకుచుట్టు పురుగు, పూత పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ పురుగు లేత ఆకులను, పూతను కలిపి గూడుగా చేసుకుని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయన్నారు. నివారణకు క్లోరిపైరిఫోస్, నోవల్యూరోన్, తయోదికార్బ్ నీటితో కలిపి మొక్క పూర్తిగా తడిసే వరకు పిచికారి చేయాలన్నారు. పురుగు ఉధృతి బాగా ఉన్నప్పుడు లామిడా సైహలోత్రిన్ మందును నీటితో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరులోని అమరావతి రోడ్డు భారత్‌పేట ఐదవ లైనులో విని యోగంలో ఉన్న బోరింగ్ పంపు కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో మూలన పడింది. స్థానికుల నీటి అవసరాలకు ఉపయోగకరంగా ఉన్న చేతిపంపు ఆర్నెల్ల క్రితం మరమ్మతుకు గురికావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు వచ్చి తీసుకెళ్లిన సిబ్బంది తిరిగి బిగించడం మరిచారు. అప్పటి నుంచి బోరును ఓపెన్‌గా అలాగే వదిలివేయడంతో చిన్నారులు ఎవరైనా అటువైపు వెళితే ప్రమాదం బారిన పడే పరిస్థితులు ఉన్నా యి. అధికారులు స్పందించి తక్షణమే చేతి పంపును బిగించాలని స్థానికులు కోరుతున్నారు.
నరసరావుపేట: సాతులూరు–నరసరావుపేట రైల్వే స్టేషన్ల మార్గంలో లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద ఈనెల 26వ తేదీ నుంచి 28 వరకు అత్యవసరంగా పట్టాలు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్‌వో వినయ్‌కాంత్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని కారణంగా ఆ మూడు రోజులు రైల్వేగేటు మూసివేయటం జరుగుతుందన్నారు. ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.
డిసెంబర్ 2 వరకు సముద్రంలో వేట నిషేధం


