క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
భట్టిప్రోలు: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. భట్టిప్రోలుకు చెందిన స్థానిక క్రీస్తు లూథరన్ దేవాలయంలో అడ్వెంట్ కాలధ్యానములు నెల రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతాయని ప్యారిష్ బాధ్యులు రెవరెండ్ దాసరి రవీంద్ర వర్మ తెలిపారు. మండలంలోని ఆళ్లమూడిలో పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్‌కు స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. వెల్లటూరు క్రీస్తు లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ కాల ఆరాధనలు ప్రారంభమయ్యాయి. పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి నాగేశ్వరరావు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకలు ప్రారంభం


