దేశ సమైక్యతకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి సర్దార్
బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్
నగరం: దేశ సమైక్యతకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కొనియాడారు. స్థానిక ఎస్వీఆర్‌ఎం కళాశాలలో మంగళవారం భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ, శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మాకర కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ ఐక్యతా పాదయాత్రలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ఉక్కు మనిషిగా చరిత్రకెక్కిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేతమైన నిర్ణయాల వల్లే దేశాన్ని ఐక్యం చేశాయన్నారు. దేశ తొలి హోంశాఖ మంత్రిగా 565 సంస్థానాలను విలీనం చేసిన గొప్పనాయకుడు అని ప్రశంసించారు. దేశ ఐక్యతకు చిహ్నం వల్లభాయ్ పటేల్ అన్నారు. తొలుత వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం పాదయాత్ర ర్యాలీని ఎంపీ ప్రారంభించారు. కార్యక్రమంలో మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయి, కరస్పాడెంట్ బుచ్చియ్యచౌదరి, ప్రిన్సిపాల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, తహసీల్దార్ నాంచారయ్య, మత్తి భాస్కరరావు పాల్గొన్నారు.


