ముగిసిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
● అండర్ 19 అర్టిస్టిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో విశాఖ పట్నానికి చెందిన పి. రమసాహితి, పి. లక్ష్మిసాహిత్య మొదటి స్థానం సాధించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వై. ముకుందశరణ్య, వై. తమీరున్ రెండో స్థానం, తూర్పు గోదావరికి చెందిన యన్. శరణ్య, ఎస్. హిమశ్రీ మూడో బహుమతి సాధించారు.
● అండర్ 19 అర్టిస్టిక్ యోగా సింగిల్ బాలికల విభాగంలో వైజాగ్‌కు చెందిన ధనలక్ష్మి మొదటి స్థానం, చిత్తురుకు చెందిన దీపిక రెండో స్థానం, విజయనగరం శ్రావణి మూడో స్థానం సాధించారు.
● అండర్ 19 రిథమిక్ యోగా ఫైర్ బాలికల విభాగంలో విశాఖపట్నానికి చెందిన కె.హరిక, బి.సంధ్య మొదటి స్థానం, తూర్పు గోదావరికి చెందిన పీడీ తనుశ్రీ, జీఆర్ సౌజన్య రెండో స్థానం, పశ్చిమ గోదావరికి చెందిన ఎస్‌ఎల్ ప్రసన్న, ఎల్. మనుజ మూడో స్థానం సాధించారు.
● అండర్ 19 ట్రెడిషనల్ యోగా బాలుర విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన ఏ. మనోహర్ మొదటి స్థానం, చిత్తురుకు చెందిన లలిత్ కుమార్ రెండో స్థానం, అనంతపురానికి చెందిన ఎం. అశోక్ కుమార్ మూడో స్థానం సాధించారు.
● అండర్ 19 రిథమిక్ యోగా ఫైర్ బాలుర విభాగంలో తూర్పు గోదావరికి చెందిన టి. సంపత్ కుమార్, ఎస్. సుర్య హర్ష కుమార్ మొదటి స్థానం, అనంతపురానికి చెందిన వి. రామ్ చరణ్, పి. తరుణ్ కుమార్ రెండో స్థానం, కర్నూలుకు చెందిన పి. చరణ్, షేక్ సాహెల్ ముడో స్థానం సాధించారు.
● అండర్ 19 ఆర్టిస్టిక్ యోగా ఫైర్ బాలుర విభాగంలో వైజాగ్‌కు చెందిన కార్తిక్, వి. శివానంద్ మొదటి స్థానం, అనంతపురానికి చెందిన గీతంగౌడ్, రఘు రెండో స్థానం, కర్నూల్‌కు చెందిన ఎం. రెడ్డి, నాయక్ మూడో స్థానం సాధించారు.
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజుల నుంచి అండర్ 14,17,19 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మంగళవారంతో ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 400 మంది పైగా క్రీడాకారులు వచ్చారు. బాలురు చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతి పొందారు. బాలికలకు గ్రామంలో గ్రామస్తులు వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రోత్సహించారు. చివరి రోజు అండర్–19 విభాగంలో యోగా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు గెలిచిన క్రీడాకారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజ అధ్యక్షత బహుమతులు అందజేశారు.
విజేతలు వివరాలు: