పందిళ్లపల్లి విద్యార్థినికి కాంస్య పతకం
వేటపాలెం: రాష్ట్ర స్థాయి హేమర్ త్రో పోటీల్లో పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల విద్యార్థిని పూజిత ప్రతిభ కనపర్చి కాంస్య పతకం సాధించినట్లు హెచ్‌ఎం తలమల దీప్తి మంగళవారం తెలిపారు. వినుకొండలో ఈ నెల 24, 25 తేదీల్లో అండర్–17 బాల, బాలికల రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయని తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థిని అబ్బు పూజిత హేమర్ త్రోలో మంచి ప్రతిభ కనపర్చి కాంస్య పతకం సాధించిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. పీఈటీ తోట వెంకటేశ్వరరావు, కర్ణ నాగేశ్వరరావు, బుద్ధి మోహహనరావు, శంఖం లలితా పరమేశ్వరి అభినందించారు.
జాతీయ కబడ్డీ పోటీలకు విద్యార్థిని ఎంపిక
చీరాల: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు చీరాల వాడరేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పిక్కి ఝాన్సీ ఎంపికయింది. ఇటీవల మచిలీపట్నంలో నిర్వహించిన అండర్–14 విభాగం కబడ్డీ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి వాడరేవు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.రత్నకుమారి, ఉపాధ్యాయులు కె. శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు సుమన్, సుమలతలు ఝాన్సీని అభినందించారు.
సమగ్ర పోషక యాజమాన్యంపై సర్టిఫికెట్ కోర్సు
గుంటూరు రూరల్: గుంటూరులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో సమగ్ర యాజమాన్యంపై 15 రోజుల సర్టిఫికెట్ కోర్సును మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ పాల్గొని మాట్లాడుతూ అభ్యర్థులకు విచక్షణ రహితంగా ఎరువులను వినియోగించడం వలన నేలలో సేంద్రియ కర్బనం తగ్గి భూమి సారాన్ని కోల్పోయి పంట దిగుబడులు తగ్గుతాయని తెలిపారు. సమగ్ర పోషక యాజమాన్యంపై విజ్ఞానాన్ని పెంచుకోవాలని తద్వారా రైతులు అవగాహన కల్పించాలన్నారు. ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎ.మనోజ్, వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 30 మంది జిల్లాస్థాయి వెస్టీస్ స్టోర్ ఇన్చార్జిలు రావేప్ విద్యార్థులు పాల్గొన్నారు.
పందిళ్లపల్లి విద్యార్థినికి కాంస్య పతకం
పందిళ్లపల్లి విద్యార్థినికి కాంస్య పతకం


