మహిళల హక్కులపై అవగాహన ముఖ్యం
నరసరావుపేట ఈస్ట్ : మహిళలు తమ హక్కులతోపాటు చట్టాల గురించి తెలుసుకుంటే సమస్యల నుంచి తేలికగా బయటపడే అవకాశం ఉంటుందని పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి ఎం.ఉమాదేవి పేర్కొన్నారు. మంగళవారం సీ్త్ర హక్కుల పరిరక్షణ, సీ్త్ర హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ (సత్తెనపల్లి) ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలా కరపత్రాలను ముద్రించటం శుభ పరిణామం అన్నారు. సమస్య వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఎదుర్కోవాలని పేర్కొన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయ నోడల్ అధికారి అరుణ, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, సభ్యులు మురళీకృష్ణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


