రోడ్డు మీద నోట్లను వెదజల్లి వృద్ధుడికి టోకరా
రోడ్డు మీద నోట్లను వెదజల్లి వృద్ధుడికి టోకరా చెరుకుపల్లి: బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి తీసుకు వెళుతున్న వ్యక్తి నుంచి ఆగంతకులు దొంగిలించిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. తూర్పుపాలేనికి చెందిన పూషడపు నారాయణ (64) వ్యవసాయ ఖర్చుల కోసం శుక్రవారం ఉదయం గుళ్లపల్లిలోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.1,64,00 డ్రా చేసుకుని బ్యాగ్‌లో పెట్టుకుని ద్విచక్ర వాహనంపై నగరం వైపు వెళుతున్నారు. బ్యాంక్‌లో నగదు డ్రా చేసిన దగ్గర నుంచి ఆయన్ను ఇద్దరు ఆగంతకులు వాహనంపై అనుసరిస్తున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత చిల్లర నోట్లను రోడ్డు పక్కన పడేసి, పెద్దాయనా..డబ్బులు పడిపోయాయంటూ నారాయణకు చూపించారు. ఆయన వాహనాన్ని ఆపి నోట్లను ఏరుకుంటుండగా నగదు ఉంచిన బ్యాగ్‌ను ఎత్తుకు పోయారు. నారాయణ కేకలు వేస్తుండగానే అతి వేగంగా వాహనంపై నగరం వైపునకు పారిపోయారు. ఆయన వెంటనే స్థానిక స్టేషన్‌కు వెళ్లి చోరీని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అ.అనిల్‌కుమార్ చుట్టుపక్కల పోలీసు స్టేషన్‌లకు సమాచారం అందించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
బేస్‌బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక కర్లపాలెం: ఉమ్మడి గుంటూరు జిల్లా బేస్‌బాల్ జట్టుకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని స్థానిక హైవెండ్ హైస్కూల్ ఎండీ సాయిమహేంద్రబాబు, డైరెక్టర్ చాందిని తెలిపారు. శుక్రవారం హైస్కూల్‌లో క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కొర్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల బేస్‌బాల్ పోటీలు జరిగాయని తెలిపారు. అండర్–14 విభాగంలో ఆట్ల ధనుష్‌రెడ్డి, అండర్–17 విభాగంలో పుట్టా సాయిహర్షవర్ధన్‌రెడ్డి ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగే రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో జిల్లా జట్టుకు ఆడతారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
కదులుతున్న బస్సులో నుంచి దూకిన వృద్ధురాలు చెరుకుపల్లి: భర్త ఎక్కపోవడంతో ఆయన కోసం కదుతున్న బస్సులోంచి దూకటంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలైన ఘటన మండల కేంద్రంలోని
సాయిబాబా ఆలయం ముందు శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అమృతలూరు మండలం గోవాడ గ్రామానికి చెందిన దావూలూరి నరసమ్మ భర్తతో కలసి చెరుకుపల్లి వచ్చింది. తిరిగి గోవాడ వెళ్లేందుకు తెనాలి బస్సు ఎక్కింది. ఇంతలో బస్సు కదిలింది. భర్త ఎక్కకపోవడంతో ఆపండీ..ఆపండీ ! అంటూ అరిచింది. డ్రైవర్ ఆపకపోవడంతో నరసమ్మ బస్సులో నుంచి దూకింది. ఈ క్రమంలో ఆమె ఎడమ కాలు వెనుక టైరు కింద పడి నుజ్జునుజ్జు అయింది. 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
రూ.1,64,00 చోరీ
సింగపూర్ పర్యటనకు అద్దంకి ఉపాధ్యాయిని
అద్దంకి: పట్టణంలోని సత్రం బడి ఉపాధ్యాయిని ధనలక్ష్మి సింగపూర్ పర్యటనకు ఎంపికయ్యారు. కాకానిపాలేనికి చెందిన ఆమె రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత. విద్యా విధానంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చేందుకు పరిశీలన నిమిత్తం ఈనెల 27న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఎనమిది రోజులు సింగపూర్‌లో పర్యటించనున్నట్లు శుక్రవారం తెలిపారు. ఆమెకు తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.
కాలుకు తీవ్ర గాయాలు
సత్రశాల దేవస్థానం ఆదాయం రూ.1,43,440
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసిన అతి ప్రాచీన శైవక్షేత్రంగా పేరు పొందిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి కార్తిక మాసం సందర్భంగా రూ.1,43,440 ఆదాయం వచ్చినట్లు సత్తెనపల్లికి చెందిన ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వి.లీలావతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్తిక మాసం నెల హుండీ ఆదాయం రూ.66,980 వచ్చిందని, 2024 కన్నా ఈ సంవత్సరం రూ.3,402 ఆదాయం తగ్గిందన్నారు. టికెట్ల ద్వారా రూ.76,460 ఆదాయం వచ్చిందన్నారు. రెంటచింతల శివాలయం ఆదాయం లెక్కించడం వాయిదా పడినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల ఎండోమెంట్ అధికారి గాదె రామిరెడ్డి, సత్రశాల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, దేవస్థానం ప్రధాన అర్చకులు చిట్టేలా శివశర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు బ్రహ్మచారి, చంద్రశేఖర్‌రెడ్డి, అనంతరాములు, సిబ్బంది తదితరులున్నారు.
1/2
రోడ్డు మీద నోట్లను వెదజల్లి వృద్ధుడికి టోకరా
2/2
రోడ్డు మీద నోట్లను వెదజల్లి వృద్ధుడికి టోకరా