నెల్లూరు జిల్లాలో పట్టుబడిన గంజాయి ధ్వంసం
యడ్లపాడు: ప్రజా ఆరోగ్య భద్రత కోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపుతున్నట్లు నెల్లూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీగా పట్టుబడిని గంజాయి, నిషేధిత మాదక ద్రవ్యాలను శుక్రవారం అధికారులు ధ్వంసం చేశారు. యడ్లపాడు మండలం కొండవీడు రెవెన్యూ పరిధిలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పవర్ ప్లాంట్‌లో మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసిన తర్వాత డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య వివరాలను తెలిపారు. నెల్లూరు జిల్లాలో 61 కేసులు ద్వారా ఎకై ్సజ్‌శాఖ స్వాధీనం చేసుకున్న నిషేధిత మాదక ద్రవ్యాలను ఈ ఏడాది జులై 9న నిర్వహించిన డీడీసీ సమావేశంలో వీటిని ధ్వంసం చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ మేరకు తాము స్వాధీనం చేసుకున్న డ్రై గంజాయి 751.586 కిలోలు, 3.2 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు కలిగిన గంజాయి మొక్కలు, 950 గ్రాములు హషీష్ ఆయిల్ ప్లాంట్‌కు తరలించి ధ్వంసం చేశారు. పర్యావరణ ప్రమాణాలు పాటిస్తూ విజయవాడలోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు వీటిని శాసీ్త్రయ పద్ధతిలో నాశనం చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్ డిస్పోజిల్ కమిటీ సభ్యులుగా నెల్లూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య, అసిస్టెంట్ కమిషనర్ పి దయాసాగర్, ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ కె విజయ్ వ్యవహరించారు. ఏపీపీసీబీ పర్యావరణ ఇంజినీర్ ఎం అజీనాబేగం, నెల్లూరు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జె రమేష్, అదే జిల్లాలోని తొమ్మిది ఎకై ్సజ్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, సిబ్బంది, ఏపీ ఆపరేషన్ టీం ప్రెసిడెంట్ ఎంవీ చారి, సిబ్బంది, కొండవీడు వీఆర్వో దండా కృష్ణ చైతన్యం, వీఆర్‌ఏ కూచిపూడి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.


