
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ
బల్లికురవ: సుబాబుల్ కర్ర లోడ్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి బల్లికురవ– సంతమాగులూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులోని కొత్త మల్లాయపాలెం బస్‌స్టాప్ సమీపంలో జరిగింది. బల్లికురవ ఎస్సీ కాలనీకి చెందిన బత్తిని చిన సుబ్బయ్య కూలీలతో మల్లాయపాలెం గ్రామ సమీపంలో సుబాబుల్ కర్ర కొట్టించుకుని ట్రాక్టర్‌కు లోడ్ చేసుకుని రోడ్ మార్జిన్‌లో ఆగాడు. కూలీలు ట్రాక్టర్‌కు లోడ్ ఎత్తుతుండగా వెనుక నుంచి ఈర్లకొండ క్వారీలకు వెళుతున్న గ్రానైట్ లారీ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మార్జిన్‌లోకి వెళ్లగా సుబాబుల్ కర్ర రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న బల్లికురవ ఎస్సై వై.నాగరాజు హుటాహుటిన ఘటనా ప్రదేశానికి సిబ్బందితో వెళ్లారు. సుబాబుల్ కర్రలను పక్కకు తీయించి ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
ఇంటికి వెళ్లే సమయానికి..
పొట్ట కూటి కోసం సుబాబుల్ కర్ర కొట్టేందుకు కూలి పనులకు వెళ్లి అరగంటలో ఇంటికి చేరేలోపే నలుగురు గాయాల పాలయ్యారు. జొన్నలగడ్డ మేరమ్మ, పందిరి చినసుబ్బయ్య, కొత్తపల్లి యేసమ్మ, గంధం మేరమ్మలను చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ