
రూ. 6.40 లక్షలు పలికిన ఆనంద్‌పేట లడ్డూ
రెంటచింతల: స్థానిక ఆనంద్‌పేట కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద 90 కేజీల లడ్డూను, 30 గ్రాముల వినాయక స్వామి వారి బంగారు లాకెట్‌ను ఇగుటూరి రాజశేఖర్‌రెడ్డి రూ. 6.40 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఊరేగింపు కొనసాగింది. ప్రధాన రహదారిపై ఆనంద్‌పేట యువత కేరింతలు పెట్టారు. వందల మంది భక్తులు తరలివచ్చారు. గత ఏడాది లడ్డూను గొంటు ఆదిరెడ్డి రూ. 7.10 లక్షలకు దక్కించుకున్నారు.
రూ. మూడు లక్షలకు పైగా ధర పలికిన లడ్డూ
పెదకాకాని: మండలంలోని వెనిగండ్ల గ్రామంలో గురువారం రాత్రి వినాయక లడ్డూ వేలం నిర్వహించారు. వేమారెడ్డి గుడి సెంటర్‌లో రెడ్డి యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బుర్రముక్కుల శ్రీనివాసరెడ్డి 25 కిలోల లడ్డూ, తియ్యగూర శ్రీ ప్రియాంక రెడ్డి 20 కిలోల లడ్డూ, పులగం వేమారెడ్డి 11 కిలోల లడ్డూ సమర్పించారు. వేలంలో అబ్బులు(ఆత్మకూరి శేషిరెడ్డి) యువసేన 25 కిలోల లడ్డూను రూ.3,01,116లకు దక్కించుకుంది. 20 కిలోల లడ్డూ రూ.40 వేలకు, 11 కిలోల లడ్డూ రూ.40 వేలకు భక్తులు దక్కించుకున్నారు. అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.