
ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్
అక్టోబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
పెదకాకాని(ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్‌న్స్ ఎడ్యుకేషన్ (సీడీఈ) పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), డెబ్ (డిస్టెనన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) నుంచి 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగుస్తుందన్నారు. కోర్సుల కాల వ్యవధి, విద్యార్హతలు, ఫీజులు తదితర వివరాలను ఏఎన్‌యూసీడీఈ. ఇన్‌ఫో అనే వెబ్‌సైట్‌లో గానీ, 0863 – 2346222, 98484 77441 ఫోను నెంబర్లను సంప్రదించడం ద్వారాగానీ తెలుసుకోవచ్చు.
ఎంబీఏ, ఎంసీఏ
ప్రవేశాలు కూడా...
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. దీని ద్వారా రెండేళ్ల కాలపరిమితితో కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ వివరాలను దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు వెల్లడించారు.