
యూరియా కోసం రైతులు అగచాట్లు
నగరం: ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులు యూరియా కష్టాలను ఎదుర్కొంటున్నారు. బయ ట మార్కెట్‌లో బస్తా రూ.450 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. పీఏసీఎస్‌లు, రైతు భరో సా కేంద్రాలలో బస్తా రూ.267కే అందిస్తున్నారు. దీంతో రైతులు సొసైటీలు, ఆర్బీకేలకు వెళుతున్నా రు. పెదపల్లి గొల్లపాలెం సొసైటీకి గురువారం యూరియా వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా రైతులు పెద్దసంఖ్యలో రావడంతో గందరగోళం నెలకొంది. టీడీపీ నాయకుల సిఫార్సులకే యూరియా ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.
కొల్లూరు: గాజుల్లంక సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. గురువారం గాజుల్లంక పీఏసీఎస్‌కు 16.50 టన్నుల యూరియా సరఫరా అయ్యిందని తెలియడంతో కొల్లూరు, గాజుల్లంక, ఆవులవారిపాలెం, పెసర్లంక, పెదలంక, చింతర్లంక, సుగ్గునలంక, ఈపూరులంక గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. రైతుల తాకిడి అధికమవడంతో పీఏసీఎస్ సిబ్బంది పాస్‌బుక్‌కు ఒక బస్తా చొప్పున పంపిణీ చేపట్టి చేతులు దులుపుకున్నారు.