
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు వెస్ట్: మైనార్టీల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో పీఎంజేబీకే, సూర్యఘర్, టూరిజం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పీఎంజేబీకే పథకం 25 శాతం మైనార్టీలున్న ప్రాంతాల్లోనే సాధ్యమన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం దీనికి ఎంపికై ందని తెలిపారు. సూర్యఘర్ పథకం కింద గుంటూరు పార్లమెంటు పరిధిలో 1.16 లక్షల మంది నమోదు అయ్యారన్నారు. 3,600 మంది ఉపయోగించుకుని లబ్ధి పొందారని పేర్కొన్నారు. జిల్లాలో టూరిజం అభి వృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ మానస సరోవరం, పేరేచర్ల వద్ద ఉన్న నందనవనం, ఉండవల్లి గుహలు, ఉప్పలపాడు విదేశీ పక్షుల కేంద్రం తదితరాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కోరుతామన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, జిల్లా టూరిజం అధికారి శ్రీరమ్య, ఎల్డీఎం మహిపాల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.