
అల్లకల్లో లంక గ్రామాలు
న్యూస్‌రీల్
పునరావాస కేంద్రాలకు
తరలిరావాలి
వరద మరింతగా పెరిగే అవకాశం
కొల్లూరు మండలం దోనెపూడి వద్ద లోలెవల్ బ్రిడ్జిపైకి నీరు
కరకట్ట దిగువన పొలాల్లోకి నీరు
150 ఎకరాల్లో నీట మునిగిన అరటి, పసుపు, కంద, కూరగాయల పంటలు
పలు లంక గ్రామాలకు రాకపోకలు బంధ్
అప్రమత్తమైన అధికారులు
బాపట్ల
అచ్చంపేట : ఎగువ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 4,28,115 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4,32,175 క్యూసెక్కులు వదులుతున్నారు.
కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో పల్నాటి వీర్ల అంకాలమ్మ తల్లికి గురువారం రాత్రి గ్రామస్తులు వైభవంగా బోనాలు సమర్పించారు.
సాక్షి ప్రతినిధి,బాపట్ల: కృష్ణానదికి వరద పెరుగుతోంది. గురువారం ఉదయం ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు 5.13 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో దిగువన కృష్ణా పరీవాహక ప్రాంతంలో పలు గ్రామాల పరిధిలోని పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. కొల్లూరు మండలం దోనెపూడి వద్ద ఉన్న లోలెవెల్ కాజవేపైకి నీరు చేరి ఆ మార్గంలో రాకపోకలు నిలిచి పోయాయి. వరద ప్రభావంతో చింతర్లంక, సుగ్గునలంక, పోతార్లంక గ్రామాల పరిధిలోని 150 ఎకరాల్లో సాగు చేసిన అరటి, పసుపు, కంద, కూరగాయల పంటలు నీటమునిగాయి. ఇదే ప్రాంతంలోని దాదాపు 200 ఎకరాల్లో పశువుల మేతతోపాటు ఇటుక బట్టీలను వరద ముంచెత్తింది. వరద ప్రభావంతో ఇప్పటికే పెసర్లంక, గాజుల్లంక, పోతార్లంక, సుగ్గునలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరిగితే తోకలవారిపాలెం, పెదలంక, చింతర్లంకతోపాటు కొల్లూరు మండలంలో 18 గ్రామాలతోపాటు భట్టిప్రోలు మండలంలోని ఐదు గ్రామాలకు నీరు చేరే అవకాశముంది. ఎగువ నుంచి కృష్ణా నదికి 6లక్షల క్యూసెక్కులకు మించి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే లంకగ్రామాల్లోని వేలాది ఎకరాలలో పంటలు నీటమునిగే అవకాశముంది. వరద నీరు 7 లక్షల క్యూసెక్కులకు మించితేనే లంకగ్రామాలకు నీరు చేరే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వరద మరింతగా పెరిగితేగే లంక గ్రామాలనుంచి ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. అధికారులు ఆదిశగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
నిలిచిన రాకపోకలు
భట్టిప్రోలు: కృష్ణా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో భట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాల్లోని పెదపులివర్రు–పెసర్లంక, ఓలేరు–పెసర్లంక, కోళ్లపాలెం–పెసర్లంక చప్టాల వద్ద నీరు చేరింది. ఆయా మార్గాల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరింత పెరిగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం లంక గ్రామాల వాసులు వెల్లటూరు చినరేవు హైలెవల్ వంతెన మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో స్థానికులు రేవులోకి వెళ్లవద్దని తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు ఆదేశించారు. కరకట్టకు గండ్లు పడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి పటిష్టం చేయడమే కాక ఇసుక మూటలను సిద్ధం చేశామన్నారు.
కొల్లూరు మండలం పెసర్లంక – పెదలంక అరవింద వారధి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
రేపల్లె: ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేసిన నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మోర్ల శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన పెనుమూడి, పెనుమూడి పల్లిపాలెం గ్రామాలలో పర్యటించారు. పెనుమూడి, పల్లిపాలెంలను వరద చుట్టుముట్టే ప్రమాదం ఉన్నందున పెనుమూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పల్లిపాలెం వాసులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

అల్లకల్లో లంక గ్రామాలు

అల్లకల్లో లంక గ్రామాలు

అల్లకల్లో లంక గ్రామాలు