
‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ప్లెక్సీ తొలగింపు
భట్టిప్రోలు(వేమూరు): భట్టిప్రోలు మండలం చింతమోటులో ఏర్పాటుచేసిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ప్లెక్సీలు తొలగించేందుకు అధికారులు సిద్ధంకాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. గ్రామానికి చేరుకున్న అశోక్‌బాబు గ్రామంలో ప్రభుత్వం అనుమతి లేని ఫ్లెక్సీలు అన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. వేమూరు, చుండూరు సీఐలు ఆంజనేయులు, శ్రీనివాసరావు, భట్టిప్రోలు, కొల్లూరు ఎస్‌ఐలు శివయ్య, జానకీ అమర్‌వర్థన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో తెలుగుదేశం ఫ్లెక్సీలు, బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ఫ్లెక్సీలని తొలగిస్తే వెళ్లిపోతామని వరికూటి వారి స్పష్టం చేశారు. గ్రామాల్లో గొడవలు జరగకుండా పోలీసులు బాధ్యతలు తీసుకోవాలని కోరారు. పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలని కోరారు. ఫ్లెక్సీల వ్యవహారం పరిష్కారం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పడమటి శ్రీనివాసరావు, బొల్లెదు ప్రతాప్, ఇమామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.