
నీట్ పీజీ సెట్‌లో డాక్టర్ ప్రవల్లికకు 1820 ర్యాంక్
నరసరావుపేట ఈస్ట్: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ–2025 పరీక్షలో పట్టణానికి చెందిన డాక్టర్ ముద్దా ప్రవల్లిక ఓపెన్ క్యాటగిరీలో 1820 ర్యాంక్ సాధించింది. వైజాగ్ ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె నీట్ పీజీ సెట్‌లో 613 మార్కులతో ఉత్తమ ర్యాంక్ సాధించింది. డాక్టర్ ప్రవళ్లిక తండ్రి ముద్దా రమేష్ పట్టణంలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకునిగా పని చేస్తుండగా, తల్లి ఉషారాణి గృహిణి. చిన్న పిల్లలకు వైద్యసేవలు అందించేందుకు తాను పీడియాట్రిక్ విభాగంలో పీజీ చేయనున్నట్టు డాక్టర్ ప్రవల్లిక తెలిపారు.