
డాక్టర్ విశ్వేశ్వరరావుకు బంగారు పతకం
తెనాలిరూరల్: పట్టణ బోస్‌రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాలులో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు స్మారక ధార్మిక బంగారు పతకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావుకు బహూకరించారు. ఈ సందర్భంగా ‘కామన్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ మేనేజ్‌మెంట్ గైడ్‌లైన్స్’పై డాక్టర్ విశ్వేశ్వరరావు ప్రసంగించారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. అనిల్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ మధుప్రభాకర్‌బాబు, డాక్టర్ కె. శ్యామ్‌ప్రసాద్, డాక్టర్ పావనిప్రియాంక, డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుటుంబసభ్యులు, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.
25న సీజ్ చేసిన బియ్యానికి వేలం
నరసరావుపేట: ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అండర్ సెక్షన్ 6ఏ కింద సీజ్ చేసిన 6,453 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సమక్షంలో ఈనెల 25న మరోసారి వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి.ప్రసాదు బుధవారం పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఈనెల 12న నిర్వహించిన వేలంలో సరైన ధర రానందున ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. బహిరంగ వేలం ప్రకటనలోని నియమ నిబంధనల మేరకు ఔత్సాహికులు పాల్గొనాలని కోరారు.
పోస్టల్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట టౌన్: తపాలా శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ స్పర్ష్ యోజన స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ జాఫర్ సాధిక్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కాలర్‌షిప్‌ను తపాలా శాఖ ప్రవేశపెట్టిందన్నారు. తపాలా శాఖ నిర్వహించే ఫిలాటెలి క్విజ్ , ఫిలాటెలి ప్రాజెక్ట్‌ల ఆధారంగా ఏడాదికి రూ.6 వేలు స్కాలర్‌షిప్ పొందవచ్చన్నారు.
విద్యార్థి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదువుతూ, సంబంధిత పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్ సభ్యుడై ఉండాలన్నారు. పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్ లేకపోతే అభ్యర్థి సొంత ఫిలాటెలి అకౌంట్ కలిగి ఉండాలన్నారు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పోస్టాఫీసుల్లో సంప్రదించాలని సూచించారు.